ETV Bharat / state

'ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే కేసీఆర్ దిగొచ్చారు' - కేసీఆర్ దిగివచ్చాడని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆరోపించారు.

ఆర్టీసీ సమ్మెతో రాష్ట్రంలో పరిస్థితులు చేయిదాటి పోయాయని, ప్రజల్లో వ్యతిరేకత పెరిగి... మున్సిపల్ ఎన్నికలపై ఆ ప్రభావం పడుతుందని ఇంటిలిజెన్స్ నివేదికలు రావడం వల్లనే కేసీఆర్ దిగివచ్చాడని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆరోపించారు.

'Working families have their right to jobs' at hyderabad
'కార్మిక కుటుంబాలకు ఉద్యోగాలు వారి హక్కు'
author img

By

Published : Nov 29, 2019, 6:19 PM IST

రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని, ఆర్టీసీ సంస్థను పరిరక్షించేందుకు ప్రభుత్వం 1000 కోట్ల గ్రాంటును విడుదల చేయాలని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి డిమాండ్ చేశారు. కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆర్ బాధ్యత వహించాలని చెప్పారు. చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాల కల్పన వారి హక్కు అని, కేసీఆర్ భిక్ష కాదన్నారు. యూనియన్లను రద్దు చేసే అధికారం కేసీఆర్​కు ఎక్కడిదని, కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేసిన ఆయనకు దీనిపై అవగాహన లేదా అని ప్రశ్నించారు.

ఇదీ చూడండి : షాద్​నగర్​ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు

TG_HYD_45_29_Jeevanreddy_on_kcr_AB_3038066 Reporter: M.Tirupal Reddy Note: Feed from CLP ofc ( ) ఆర్టీసీ సమ్మెతో రాష్ట్రంలో పరిస్థితులు చేయిదాటి పోయాయని...ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని...మున్సిపల్ ఎన్నికలపై ఆ ప్రభావం పడుతుందని ఇంటిలిజెన్స్ నివేదికలు రావడంతో నే కేసీఆర్ డిగివచ్చాడని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. చార్జీల పెంపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ఆర్టీసీ సంస్థను పరిరక్షించేందుకు ప్రభుత్వం వెయ్యి కోట్లు గ్రాంటుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులను సమ్మెకు పోయేలా కేసీఆర్ వ్యూహాత్మకంగా పురిగొల్పాడని ధ్వజమెత్తారు. ఆర్టీసీ చార్జీలను పెంచేందుకు..కేసీఆర్ నే ఇలా చేశాడని.. పేర్కొన్నారు. చార్జీల పెంపుపై ప్రజల దృషి పడకుండా.. సమ్మెలో కార్మికులను విధుల్లో చేర్చుకోవడంపైకి మళ్లించారన్నారు. కార్మికుల గురించి కేసీఆర్ ఇప్పుడు చెబుతున్న పెద్ద పెద్ద మాటలు ఇన్ని రోజులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆర్టీసీ సమ్మె తో సంస్థకు వచ్చిన నష్టంనకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. చార్జీల పెంపుతో సంస్థకు వెయ్యి కోట్లపైన అదనపు ఆదాయం వస్తుందన్న ఆయన పల్లె వెలుగు బస్సులపైనే చార్జీల మోత అధికంగా పడుతుందన్నారు. తాను రవాణా మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీని లాభాల తెచ్చానని చెబుతున్న కేసీఆర్ .. సీఎంగా ఎందుకు లాభాల బాటన నడపలేక పోయారని ప్రశ్నించారు. యూనియన్స్ రద్దు చేసే అధికారం కేసీఆర్ కు ఎక్కడిది .. కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేసిన ఆయనకు దీనిపై అవగాహన లేదా అని ప్రశ్నించారు. ఏపీలో జగన్ ఆర్టీసీ కార్మికులకు మెరుగైన జీవనం అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు .. మరి కేసీఆర్ కు ఏమైందని నిలదీశారు. కేసీఆర్ మదిలో ఎప్పుడు నియంతృత్వ ధోరణి ఆలోచనలే ఉంటాయని ఆరోపించారు. కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆర్ బాధ్యత వహించాలి .. ఆర్టీసీ నష్టాలకు కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాల కల్పన వారి హక్కు .. కేసీఆర్ భిక్ష కాదన్నారు. బైట్: జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.