ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు చెందిన అశ్విత తన కుటుంబంతో కలిసి హైదరాబాద్లోని చిత్రపురి కాలనీలో నివాసం ఉంటుంది. బాచుపల్లిలో ఉండే చందు అనే వ్యక్తితో అశ్వితకు పబ్లో పరిచయం ఏర్పడింది. అది కాస్త... ప్రేమగా మారి కొంత కాలం వీరిద్దరు సహజీవనం చేశారు.
ముఖం చాటేసిన ప్రియుడు...
ఈ మధ్య ప్రియుడు చందు అశ్వితకు ముఖం చాటేస్తు తప్పించుకు తిరిగుతున్నాడు. ఫోన్లో కూడా అందుబాటులో లేకపోవడంతో విసిగిపోయిన అశ్విత ఇవాళ బాచుపల్లిలో చందు ఉండే నివాసానికి వెళ్లింది.
మాట్లాడించండి.. లేదంటే సుసైడ్ చేసుకుంటా...
అక్కడ చందు లేకపోవడంతో కోపంతో ఉన్న అశ్విత బాచుపల్లి పీఎస్కు వెళ్లి తన ప్రియుడిని తీసుకుని రావాలని హల్చల్ చేసింది. ప్రియుడితో 10 నిమిషాలు మాట్లాడించాలని లేదంటే పీఎస్లోనే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది.
గతంలోనే యువతి ఇలాగే...
అశ్వితకు పోలీసులు ఎంత నచ్చచెప్పినా వినలేదు. చివరకు బాచుపల్లి సీఐ జగదీశ్వర్ షీటీం వారిని పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించాడు. అశ్విత అన్నను పీఎస్కు పిలిపించి... ఆమెను అప్పజెప్పాడు. చందుని తీసుకురావడానికి ఫిర్యాదు రాసివ్వమంటే అశ్విత నిరాకరించింది. గతంలో కూడా రాయదుర్గం పీఎస్లో ఇలానే హల్చల్ చేసిందని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: 5 ఎకరాల పొలం.. 23 రకాల పంటలు...