అనంతపురం జిల్లా కూడేరు మండలం ఇప్పేరు గ్రామంలో ఓ మహిళ హల్‌చల్ చేసింది. పంచాయతీ కార్యాలయంలో నిన్న జరిగిన స్పందన కార్యక్రమంలో పింఛన్ ఇవ్వకపోతే చంపేస్తానని శివమ్మ అనే మహిళ కొడవలితో బెదిరించింది. మరికొందరు పింఛన్ రాకపోతే పెట్రోల్ పోసి హతమారుస్తామని పంచాయతీ కార్యదర్శి మురళీకృష్ణను హడలెత్తించారు. కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఘటనాస్థలానికి చేరుకుని పెన్నోబులేశు, శివమ్మను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ అనర్హులుగా తేల్చి పింఛన్లు నిలిపివేయటంతో వారు ఈ విధంగా వీరంగం సృష్టించారు.
ఇవి కూడా చదవండి: