ఆడపిల్లలకు సాధికారత అనేది ఇంట్లోనే ప్రారంభం కావాలని ప్రముఖ బుల్లి తెర యాంకర్ సుమ కనకాల అన్నారు. ఇంట్లో తల్లి ఆడపిల్లలు ఎలా ఉండాలి... ఎలా జీవించాలి అనే అంశాలను నేర్పిస్తే...తండ్రి ప్రోత్సహించాలన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రిపబ్లిక్ ఆఫ్ టర్కీ కాన్సులేట్ జనరల్ కార్యాయంలో ప్రముఖ వస్త్ర సంస్థ నీరూస్ ఆధ్వర్యంలో ఉమెన్ ఎంపవర్‌మెంట్ అండ్ ఫ్యాషన్ అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాంకర్ సుమతో పాటు సినీ నటి లక్ష్మి మంచు, ప్రిన్స్ సాయిదా హాజీ, కుబ్రా అల్టినోర్లు, సూచిత ఆహుజతో పాటు వ్యాపార రంగానికి చెందిన పలువురు మహిళలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: అఘాయిత్యానికి పాల్పడింది ఆ నలుగురే