ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా శ్రీనివాసరావు పేటలో ఉంటున్న ధనలక్ష్మి... గత ఇరవై ఏళ్లుగా చిట్టీల వ్యాపారం చేసేది. ఆమెను నమ్మి స్థానికులు లక్షల్లో చిట్టీలు కట్టారు. ఏమైందో ఏమోగానీ అకస్మాత్తుగా ఆమె కనిపించకుండా పోయింది. ఇవాళ వస్తుంది... రేపు వస్తుందని 3 నెలలుగా చూసిన బాధితులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. తమను నట్టేట ముంచి... దాదాపు రూ. 2 కోట్లతో పారిపోయిందని ఫిర్యాదు చేశారు. పోలీసులు అంత సీరియస్‌గా ఈ కేసును పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఎంతో కష్టపడి చిట్టీలు కట్టామని... నిందితురాలిని పట్టుకొని డబ్బులు ఇప్పించాలని గుంటూరు అర్బన్ ఎస్పీకి విన్నవించుకున్నారు.
ఇదీ చదవండి: