హైదరాబాద్ నాంపల్లి వద్ద విధుల్లో ఉన్న హోంగార్డుపై ద్విచక్ర వాహనదారుడు దాడి చేశాడు. తాజ్ ఐలాండ్ వద్ద హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుడిని... శిరస్త్రానం ధరించలేదని హోం గార్డు ఫొటో తీశాడు. కోపోద్రిక్తుడైన వాహనదారుడు హోంగార్డు జాకీర్ హుస్సేన్‌పై ఇటుక రాయితో దాడి చేశాడు. అందరూ గుమిగూడడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. తన ఎడమ చేతికి రక్తస్రావం కావడంతో వాహనదారుడిపై నాంపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు హోంగార్డు.
ఇవీ చూడండి : జహీరాబాద్‌లో నిర్బంధ తనిఖీలు