చేనేత కార్మికుల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యచరణ కమిటీ ఏర్పాటు చేయాలని తెతెదేపా రాష్ట్ర అధ్యక్షుడు రమణ డిమాండ్ చేశారు. జాతీయ నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల సమావేశం ఏర్పాటు చేశారు.
చేనేత వృత్తి అస్తిత్వ పోరాటం, ఆర్థిక స్వావలంబనకై ఆరాటం, కబలిస్తున్న కార్పొరేట్ శక్తులు, మరుగున పడుతున్న చట్టాలు తదితర అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించారు. జాతీయ నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 9న నిర్వహించే నేతన్నల సమరనాథం-ఛలో దిల్లీ కార్యక్రమానికి తమవంతు సహకారం అందిస్తామని నేతలు హామీ ఇచ్చారు.
చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది బడ్జెట్‌లో రూ.50 వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేల కోట్లు కేటాయించాలని బీసీ సంఘం జాతీయ నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు రాష్ట్రంలో కేవలం సిరిసిల్ల మాత్రమే కనిపిస్తున్నాయని...30 వేల మంది చేనేత కార్మికులు ఉంటే కేవలం 3వేల మందికి ఉపాధి కల్పించి గొప్పలు చెప్పుకుంటున్నారని పలువురు వక్తలు మండిపడ్డారు.
ఇవీ చూడండి:దిశ సెల్‌ఫోన్‌ను గుర్తించిన పోలీసులు