తిరుపతి దేవస్థానం ఈవోగా నియమితులైన జవహర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అలిపిరి నుంచి బయల్దేరే ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలిపిరి నడక మార్గం ద్వారా కొండకు చేరుకున్న ఆయన.. శ్రీవారి ఆలయానికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం రంగనాయక మండపంలో ఈవో జవహర్‌రెడ్డికి వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అన్నమయ్య భవన్లో తితిదే ఉన్నతాధికారులతో జవహర్‌రెడ్డి సమావేశం అవుతారు. ఈ నెల 16 నుంచి జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించనున్నారు.
ఇదీ చదవండి: కరోనా ప్రభావంతో కళ తప్పిన తిరుమల క్షేత్రం