ETV Bharat / state

ఆర్టీసీ కండక్టర్ల విద్యార్హత చూసి విస్తుపోయిన యాజమాన్యం - TSRTC CARGO SERVICES

త్వరలో ఆర్టీసీ కార్గో సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం మార్కెటింగ్​ ఎగ్జిక్యూటివ్​లుగా సంస్థలో పనిచేసే కండక్టర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది ఆర్టీసీ. కండక్టర్ల విద్యార్హతలు చూసి యాజమాన్యం విస్తుపోయింది.

TSRTC
ఆర్టీసీ కండక్టర్ల విద్యార్హత చూసి విస్తుపోయిన యాజమాన్యం
author img

By

Published : Jan 24, 2020, 6:59 AM IST

ఆర్టీసీ కండక్టర్ల విద్యార్హత చూసి విస్తుపోయిన యాజమాన్యం

ఆర్టీసీ కండక్టర్లుగా ఉద్యోగం చేయాలంటే పదో తరగతి పాసైతే చాలు. కానీ దేశంలో ఉన్న నిరుద్యోగానికి యువత డిగ్రీలు, పీజీలు చేసి కూడా కండక్టర్ల ఉద్యోగాలు చేస్తున్నారు. ఇటీవల ఆర్టీసీ యాజమాన్యం కార్గో సేవల కోసం మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలకు అర్హత కలిగిన కండక్టర్ల నుంచి దరఖాస్తులు కోరింది. అప్లికేషన్లు చూసిన యాజమాన్యం అల్ప ఉద్యోగితను చూసి ఆశ్యర్యపోయింది.

ఉన్నత విద్యావంతులే అధికం

టిక్కెటేతర ఆదాయంలో భాగంగా ఆర్టీసీ కార్గో సేవలపై సంస్థ దృష్టిసారించింది. ఇందు కోసం ఇప్పటికే పనిచేస్తున్న కండక్టర్లను.. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్​లుగా నియమించేందుకు నిర్ణయం తీసుకొంది. ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఎంబీఏ, ఎంటెక్​, ఎంసీఏ, ఎమ్మెస్సీ వంటి ఉన్నత విద్యనభ్యసించి కండక్టర్లుగా పనిచేస్తుండడం చూసి ఆశ్యర్యపోయారు. ఎంపికయిన 112 మందిలో 72 మంది పోస్ట్​ గ్రాడ్యుయేట్లు ఉండగా.. 56 మందిలో ఒకటికన్నా ఎక్కువ డిగ్రీలు చేసిన వారు ఉన్నారు.

కేసీఆర్​ నిర్ణయం కోసం..

ఈనెల 27వ నుంచి కార్గో సేవలను ప్రారంభించాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. తొలిదశలో 52 కార్గో బస్సులను సిద్ధం చేయాలని నిర్దేశించారు. సోమవారం నాటికి 20 కార్గో బస్సులను అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. గురువారం వరకు సీఎం కార్యాలయం నుంచి అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలో అదేరోజు నుంచి సేవలు ప్రారంభమవుతాయా.. లేదా.. అన్న సందేహం అధికారుల్లో వ్యక్తమవుతోంది.

ఇవీచూడండి: ఆర్టీసీ కార్గో సేవలకు ముహూర్తం ఖరారు..

TG_HYD_07_24_RTC_HIGHLY_STUDY_CONDUCTOR_DRY_3182388 reporter : sripathi.srinivas నోట్ : ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ( ) ఆర్టీసీ కండక్టర్లలో ఉన్నత విద్యార్హతలు ఉన్నవారూ ఉన్నారు. వారి ఉన్నత చదువులు చూసి అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఆర్టీసీ కార్గో సేవలను తీసుకొచ్చేందుకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లను నియమించేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ఇందులో భాగంగా ఆసక్తి ఉన్నవారిని మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం ధరఖాస్తు చేసుకోవాలని యాజమాన్యం సూచించింది. వచ్చిన ధరఖాస్తులను పరిశీలించగా...ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కార్గో సేవల్లో కండక్టర్ల నుంచి ఎగ్జిక్యూటివ్ లు గా చేరిన వారిలో ఎంబీఏ, ఎంటెక్, ఎం.సీ.ఏ, ఎమ్మెస్సీ విద్యార్థార్హతలు కలిగినవారు ఉన్నారు. వీరిని చూసి అశ్చర్యపోవడం అధికారుల వంతయింది. టిక్కెటేతర ఆదాయంలో భాగంగా ఆర్టీసీ కార్గో సేవలపై దృష్టిసారించింది. ఈనెల 27వ తేదీ నుంచి కార్గో సేవలను ప్రారంభించాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. గురువారం వరకు సీఎం కేసీఆర్ కార్యాలయం నుంచి కార్యక్రమం అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలో ఆరోజు కార్గో సేవలు ప్రారంభం అవుతాయా..లేదా అన్న సందేహం అధికారుల్లో వ్యక్తమవుతుంది. తొలిదశలో 52 కార్గో బస్సులను సిద్దం చేయాలని అధికారులు నిర్ణయించారు. సొమవారం నాటికి 20 కార్గో బస్సులు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. కార్గో సేవలకు అవసరమైన సిబ్బందిని ఆర్టీసీ నుంచి తీసుకోవాలన్ని నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఇందులో భాగంగా కార్గో వ్యాపారాన్ని విస్తరించేందుకు 112 మంది మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అధికారులు అవసరమని అధికారులు గుర్తించారు. ఈవిధులను నిర్వర్తించేందుకు ఆసక్తిగా ఉన్నవారు ధరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరారు. ఐతే అర్హులను గుర్తిచే క్రమంలో ఉన్నత చదువులు చదివిన వారు ఉన్నారని అధికారులు విస్తుపోయారు. ఉన్నత చదువులు చదవినప్పటికీ..కండక్టర్లుగా పనిచేస్తున్నారని అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. కార్గో ఎగ్జిక్యూటివ్ గా ఎంపిక చేసిన 112 మందిలో 72 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు ఉండగా, 40 మంది మాత్రమే పట్టభధ్రులు ఉన్నారు. 56 మందిలో ఒకటికన్న ఎక్కువ సంఖ్యలో డిగ్రీలు చేసిన వారు ఉండం విశేషం.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.