మున్సిపల్ ఎన్నికల్లో తెరాస విజయఢంకా మోగించటం ఖాయమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఫలితాలు ప్రతిపక్షాలకు కనువిప్పు అవుతాయన్నారు. ఎన్నికలు ఈవీఎంలతో జరిగినా... బ్యాలెట్ పేపర్తో జరిగినా హవా తెరాసదేనని స్పష్టం చేశారు. భాజపాకి ఈ ఎన్నికల్లో మతం తప్ప మరో అంశం దొరకలేదన్నారు.
క్యాంప్ రాజకీయాలపై మాట్లాడే అర్హత కాంగ్రెస్, భాజపాలకు లేదు...
ప్రతి పక్షాలకు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు లేరంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, భట్టి ఇలాఖాల్లో తెరాస విజయం సాధించబోతోందని తెలిపారు. సీఎం కేసీఆర్ మీద ప్రజలకు విశ్వాసం ఉండబట్టే తెరాస అన్ని ఎన్నికల్లో విజయం సాధిస్తోందని ఆయన స్పష్టం చేశారు. క్యాంప్ రాజకీయాలపై మాట్లాడే అర్హత కాంగ్రెస్, భాజపాలకు లేదని పల్లా విమర్శించారు. ఓటమిని ప్రతిపక్షాలు హుందాగా అంగీకరించాలని హితవు పలికారు.
ఇవీ చూడండి : బస్తీమే సవాల్: ఫలితాలపై టెన్షన్ టెన్షన్...కోట్లలో బెట్టింగ్..