ETV Bharat / state

'తెరాస పథకాలను కాంగ్రెస్​ కాపీ కొడుతోంది' - కాంగ్రెస్​ పై పల్లా రాజేశ్వర్​రెడ్డి ధ్వజం

పురపాలిక ఎన్నికలపై విజన్​ డాక్యుమెంట్​ విడుదల చేసిన కాంగ్రెస్​ తన డొల్లతనాన్ని బయటపెట్టుకుందని తెరాస నేత, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్​రెడ్డి ధ్వజమెత్తారు.

trs leader palla rajeshwar reddy says that congress party is copeing trs government's schemes
'తెరాస పథకాలను కాంగ్రెస్​ కాపీ కొడుతోంది'
author img

By

Published : Jan 16, 2020, 5:56 PM IST

'తెరాస పథకాలను కాంగ్రెస్​ కాపీ కొడుతోంది'

తెరాస నాయకుడు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్​పై విరుచుకుపడ్డారు. పుర ఎన్నికలపై విజన్ డాక్యుమెంట్ విడుదల చేసిన కాంగ్రెస్‌... తన డొల్ల తనాన్ని బయటపెట్టుకుందని ధ్వజమెత్తారు.

విజన్ డాక్యుమెంట్‌లో 5 రూపాయల భోజనం పెడతామని కాంగ్రెస్ ప్రకటించిందని, ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన 5 రూపాయల భోజనం ఎలా ఉందో జానారెడ్డిని అడిగి తెలుసుకోండని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం చేసిన ప్రతి పథకాన్ని కాంగ్రెస్.. తమ డాక్యుమెంట్‌లో పెట్టిదని విమర్శించారు.

వచ్చే ప్రభుత్వం తమదే అన్నట్లుగా భాజపా వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. మున్సిపాలిటీల్లో 80 స్థానాలు ఏకగ్రీవమయ్యాయని...సింహభాగం తెరాస గెలుస్తోందని పల్లా ధీమా వ్యక్తం చేశారు. తమ నాయకుడు కేటీఆర్ చెప్పిందే జరుగుతుందన్నారు.

TG_Hyd_32_16_TRS_Palla_On_Congress_AB_3064645 Reporter: Nageswara Chary Script: Razaq Note: ఫీడ్ తెలంగాణ భవన్ OFC నుంచి వచ్చింది. ( ) తెరాస నాయకుడు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. మున్సిపల్ ఎన్నికలపై విజన్ డాక్యుమెంట్ విడుదల చేసిన కాంగ్రెస్‌ తన డొల్ల తనాన్ని బయటపెట్టుందని ధ్వజమెత్తారు. విజన్ డాక్యుమెంట్‌లో 5 రూపాయల భోజనం పెడతామని కాంగ్రెస్ ప్రకటించిందని, ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన 5 రూపాయల భోజనం ఎలా ఉందో జానారెడ్డిని అడిగి తెసుకోండని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం చేసిన ప్రతి పథకాన్ని కాంగ్రెస్ వాళ్ల డాక్యుమెంట్‌లో పెట్టి ప్రకటిస్తున్నారని విమర్శించారు. తెలంగాణభవన్‌లో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, దండె విఠల్‌తో కలిసి పల్లా మీడియా సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు లేక ఒక పార్టీ, కొంతమంది అభ్యర్థులు ఉన్నది మరోక పార్టీగా కాంగ్రెస్, భాజపాలను అభివర్ణించారు. వచ్చే ప్రభుత్వం తమదే అన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. మున్సిపాలిటీల్లో 80 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని...సింహభాగం టీఆర్‌ఎస్సే గెలుస్తుందని పల్లా ధీమా వ్యక్తం చేశారు. తమ నాయకుడు కేటీఆర్ చెప్పిందే జరుగుతుందన్నారు. బైట్: పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.