ETV Bharat / state

9 కార్పొరేషన్లలో కారు హవా

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగిన అన్ని కార్పొరేషన్లలో కారు జోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో తెరాస 30 డివిజన్లలో విజయం సాధించగా... కాంగ్రెస్ 7, భాజపా 6, ఇతరులు 7 డివిజన్లలో గెలుపొందారు.

author img

By

Published : Jan 25, 2020, 12:50 PM IST

trs is in lead in telangana corporation elections
కార్పొరేషన్లలో కారు హవా

తెలంగాణ వ్యాప్తంగా పురపాలికలతో పాటు 9 స్థానాలకు జరిగిన నగరపాలక సంస్థల ఫలితాల్లో తెరాస హవా కొనసాగుతోంది.

బడంగ్​పేట కార్పొరేషన్​ పరిధిలోని 32 డివిజన్లలో ఇప్పటి వరకు 4 స్థానాల్లో తెరాస విజయం సాధించగా కాంగ్రెస్, భాజపా చెరో 2, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు. బండ్లగూడ జాగీర్​లోని 22 డివిజన్లలో తెరాస 5, కాంగ్రెస్ 3 స్థానాలు కైవసం చేసుకున్నాయి.

బోడుప్పల్​ నగరపాలక సంస్థ పరిధిలోని 28 డివిజన్లలో ఇప్పటి వరకు తెరాస ఖాతా తెరవలేదు. కాంగ్రెస్, ఇతరులు చెరో స్థానంలో గెలుపొందారు. పీర్జాదిగూడ కార్పొరేషన్​లోని 26 డివిజన్లలో తెరాస 3 స్థానాల్లో గెలుపొందింది. జవహార్​నగర్​ పరిధిలోని 28 డివిజన్లలో తెరాస4, కాంగ్రెస్ 1, ఇతరులు 1 స్థానంలో విజయం సాధించారు.

నిజాంపేట కార్పొరేషన్​ పరిధిలో 33 డివిజన్లలో తెరాస 3, ఇతరులు 1 స్థానంలో గెలుపొందారు. ఇప్పటి వరకు మొత్తం నగరపాలక సంస్థల ఫలితాలు పరిశీలిస్తే తెరాస 30 డివిజన్లలో విజయం సాధించగా... కాంగ్రెస్ 7, భాజపా 6, ఇతరులు 7 డివిజన్లలో గెలుపొందారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.