రవాణాశాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలపై ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈనెల 9 నుంచి 16 వరకు భాగ్యనగరంలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు జరిపారు.
అందులో భాగంగా 64 వాహనాలపై కేసులు నమోదు చేసి, 4 వాహనాలను సీజ్ చేశారు. ఆ వాహనాల నుంచి లక్షా 67 వేల కాంపోనెంట్ రుసుం, 5 లక్షల 56వేల వాహన పన్నును వసూలు చేసినట్లు రవాణాశాఖ అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి : ఒక దొంగ.. 31 బైకుల చోరీ..