తెరాస చేసిన మోసాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని హస్తం అభ్యర్థులకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో తెరాస, భాజపాలను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ గాందీభవన్‌లో పుర ఎన్నికల డాక్యుమెంట్ విడుదల చేశారు. శుక్రవారం డీసీసీ అధ్యక్షులు అన్ని జిల్లా కేంద్రాల్లో విడుదల చేయాలని సూచించారు. మున్సిపాలిటీలకు దగ్గర ఉన్న గ్రామాల నాయకులు ప్రచారానికి వెళ్లాలని ఆదేశించారు.