ETV Bharat / state

భాగ్యనగరంలో ప్లాస్టిక్‌ రహిత వీధి వ్యాపారుల ప్రాంతం అదే..!!

అక్కడి వీధి వ్యాపారులు ప్లాస్టిక్​ను పూర్తిగా నిషేధించారు. టీ, అల్పాహారం, భోజనం ఇలాంటి విక్రయాలు ఏవైనా పర్యావరణహితంగా ఉండాల్సిందే. పేపర్​ లేదా స్టీల్‌ ప్లేట్లను మాత్రమే వాడుతారు. వ్యాపారులు వంట సామగ్రి నిల్వకు, ఆహారపదార్థాల పొట్లాలకు ఉపయోగించే బాక్సులు సైతం హరితహితంగానే ఉంటాయి. అదేక్కడో మనమూ చూద్దాం.

this-is-the-area-for-the-non-plastic-street-vendor-in-the-hyderabad
భాగ్యనగరంలో ప్లాస్టిక్‌ రహిత వీధి వ్యాపారుల ప్రాంతం అదే..!!
author img

By

Published : Dec 5, 2019, 4:36 PM IST

వీధి వ్యాపారుల కోసం కేటాయించిన ప్రాంతం అది. అక్కడ వారు తమ రోజువారీ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ప్రత్యేకంగా స్టాళ్లను తీర్చిదిద్దుతున్నారు. టీ, అల్పాహారం, భోజనం ఇలాంటి విక్రయాలు ఏవైనా చేసుకోవచ్చు. కానీ అక్కడ ప్లాస్టిక్‌ వాడకం పూర్తిగా నిషేధం. టీ కప్పులు, గ్లాసులు, పళ్లేలు అన్నీ పర్యావరణహితంగా ఉండాల్సిందే. మొక్కజొన్న, అరటిచెట్టు నార, వెదురు లేదా స్టీల్‌ ప్లేట్లను మాత్రమే వాడాలి. వ్యాపారులు వంట సామగ్రి నిల్వకు, ఆహారపదార్థాల పొట్లాలకు ఉపయోగించే బాక్సులు సైతం హరితహితంగానే ఉండాలి.

అందుకే దాన్ని ‘ప్లాస్టిక్‌ రహిత వీధి వ్యాపారుల ప్రాంతం’ (ప్లాస్టిక్‌ ఫ్రీ స్ట్రీట్‌ వెండర్స్‌ జోన్‌)గా పిలుస్తున్నారు. దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా దీన్ని నగరంలో ఏర్పాటు చేస్తుండడం విశేషం. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో మాదాపూర్‌ శిల్పారామం ఎదురుగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతున్నారు. హైటెక్‌ సిటీలో ప్రధాన రహదారులు, పాదబాటలను ఆక్రమించి తోపుడు బండ్లను, ఫుడ్‌కోర్టులు, టీ, జ్యూస్‌ సెంటర్లను నిర్వహిస్తున్న వారందరినీ ఖాళీ చేయించి ఇక్కడికి తరలించనున్నారు.

శిల్పారామం ఎదురుగా అయ్యప్ప సొసైటీ అండర్‌పాస్‌ సమీపంలో రోడ్డు పక్కనే ఖాళీగా ఉన్న చోటులో 50 స్టాళ్లతో ఈ జోన్‌ను సిద్ధం చేస్తున్నారు. వాడి పారేసిన ప్లాస్టిక్‌ సీసాలు, సంచుల పునర్వినియోగంతో తయారు చేసిన సామగ్రితో ఈ స్టాళ్లకు గుజరాత్‌కు చెందిన ఓ కంపెనీ రూపుదిద్దింది. ఒక్కో దాని తయారీకి దాదాపు 2 వేల ప్లాస్టిక్‌ సీసాలను రీసైకిల్‌ చేశారు. ఆరున్నర అడుగుల ఎత్తు, ఆరున్నర అడుగుల వెడల్పు సైజులో 40 పెద్దవి, మూడున్నర అడుగుల ఎత్తు, మూడున్నర అడుగుల వెడల్పులో 10 చిన్న స్టాళ్లను తయారు చేస్తున్నారు. ఒక్కో స్టాల్‌ ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ రూ.90 వేలు ఖర్చు చేస్తోంది. 800 మీటర్ల విస్తీర్ణంలో వీటిని వరుసగా ఏర్పాటు చేస్తున్నారు.

ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఆధ్వర్యంలో క్లీన్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్‌ ప్రోగ్రాం కింద ఫుడ్‌ కోర్ట్స్‌ నిర్వహించే చిరువ్యాపారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఆహార పదార్థాల తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వినియోగదారులకు వడ్డించే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం మొదటిదశ శిక్షణ ముగిసింది. రెండదశ శిక్షణ అయ్యాక ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ధ్రువపత్రాలు ఇస్తారు. అవి ఉన్న వారికే స్టాళ్లు కేటాయిస్తారు. మరో పక్షం రోజుల్లో ప్రారంభిస్తామని చందానగర్‌ సర్కిల్‌ ఈఈ చిన్నారెడ్డి తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.