హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో నివసించే ఫార్మా ఇండస్ట్రీ వ్యాపారి రఘురామి రెడ్డి ఇంట్లో ఈ నెల 12న చోరి జరిగింది. సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా సంఘటపై జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ విచారణలో యూసుఫ్ గూడకు చెందిన మొహమ్మద్ మన్సూర్‌ను పోలీసులు నిందితుడిగా గుర్తించారు. అతని వద్ద నుంచి రూ.11.60లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు, రూ.14,500ల నగదును స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడిన అతను ఈ చోరీల బాట పట్టినట్లు వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. దొంగను పట్టుకున్న జూబ్లీహిల్స్ పోలీసులను డీసీపీ అభినందించారు.
ఇవీచూడండి: మోసగాళ్ల అరెస్టు... నకిలీ బంగారం, గంజాయి స్వాధీనం