దిశ నిందితుల రీపోస్టుమార్టంను దిల్లీ ఎయిమ్స్ నుంచి వచ్చిన ఒక సీనియర్ అసిస్టెంట్‌తో పాటు ముగ్గురు ఫోరెన్సిక్ నిపుణులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. నిందితుల బంధువులతో మాట్లాడిన తర్వాత మృతదేహాలను వారు గుర్తుపట్టిన అనంతరం పోస్టుమార్టం ప్రక్రియను ప్రారంభించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. నిందితుల అభ్యర్థనను కూడా రికార్డు చేశారన్నారు.
ఈ పోస్టుమార్టం ప్రక్రియలో గాంధీ ఆసుపత్రికి చెందిన వైద్యులెవరూ పాల్గొనడం లేదని శ్రవణ్ కుమార్ వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారంగా సాయంత్రం 4గంటలలోపు పూర్తి చేస్తామన్నారు. రీ పోస్టుమార్టం చాలా పారదర్శకంగా జరుగుతోందన్నారు. గత పోస్ట్ మార్టం రిపోర్టులను అడిగారని వాటిని కోర్టుకు పంపించినట్లు చెప్పామని తెలిపారు.
ఒక్కో మృతదేహం పోస్టుమార్టం చేయడానికి 40నిమిషాల సమయం పడుతుందన్నారు. పోస్టుమార్టం తర్వాత హైకోర్టు ఆదేశించిన విధంగా... రెండు అంబులెన్స్‌లలో వాళ్ల గ్రామాలకు పంపడానికి ఏర్పాట్లు చేసినట్లు సూపరింటెండెంట్ చెప్పారు.
ఇదీ చూడండి : హైదరాబాద్‌లో సీసీఎస్ ఎస్ఐ ఆత్మహత్య