సినీ నటుడు షాయాజీ షిండే ముంబయిలోని తన నివాసంలో మూడు మామిడి మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటినట్లు షిండే తెలిపారు. ప్రతిఒక్కరూ తమ జన్మదినోత్సవాల సమయంలో ఓ మొక్కనాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా కోసం అందరూ తమ వంతు కృషి చేస్తే దేశమంతా పచ్చదనమవుతుందని చెప్పారు.
ఇవీ చూడండి : 'కేసీఆర్ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'