మహిళల ఆరోగ్య సమస్యల్లో తెలంగాణ పోలీసులను భాగస్వాములను చేయడం సంతోషకరమని సినీయర్ ఐపీఎస్ అధికారిణి సుమతి పేర్కొన్నారు. ప్రసూతి, గైనకాలజికల్ సోసైటీ వార్షిక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సమావేశానికి భరోసా కోర్టు న్యాయమూర్తితో పాటు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా లైంగిక దాడులకు గురైన బాధితులకు సంబంధించిన మాన్యువల్‌తోపాటు పోస్టర్‌ను సుమతి విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రతి వైద్యులు ఈ మాన్యువల్లో సూచించిన మార్గదర్శకాల ప్రకారంగా నడుచుకున్నట్లయితే మహిళల భద్రతకు మంచి ముందడుగు అవుతుందని అమె అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ప్రసూతి గైనకాలజికల్ సోసైటీ అధ్యక్షురాలు వింధ్య, కార్యదర్శి అరుణ సుమన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద ఐదుగురు!