ETV Bharat / state

ఇది ఫాస్ట్​ ఫుడ్​ కాదు...  స్లో ఫుడ్​ సెంటర్ - slow food centre in hyderabad

ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినాలని ఎవరికుండదూ.. తినేటప్పుడైనా ప్రశాంతంగా భోంచేయాలని ఎవరనుకోరు. ఈ ఉరుకుల పరుగుల జీవనం, బిజీ రెస్టారెంట్లలో ఆ సదుపాయాలు, వసతులు చాలా అరుదు. ఈ స్పేస్​ను పూరిస్తూ థీమ్ రెస్టారెంట్లు, కెఫేలు ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఇంట్లో ఉండే వాతావరణం, లైవ్ మ్యూజిక్, ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కాసేపు చిల్ అవుట్ అవ్వాలనుకునే వారికోసం చక్కని చాయిస్​ హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టెర్రాసిన్ కెఫే.

terrassen cafe one of the best theme restaurants in hyderabad
ఆస్వాదిస్తూ ఆరగించండి!
author img

By

Published : Dec 15, 2019, 6:17 AM IST

ఆస్వాదిస్తూ ఆరగించండి!

థీమ్ రెస్టారెంట్లకు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. టేస్టీ ఫుడ్, కాన్సెప్ట్ నచ్చితే తప్పక ఆదరణ లభిస్తుందని నిరూపిస్తున్నారు నగరవాసులు. ఫుడ్ అనేది సెంట్రల్ పాయింట్​గా పెట్టుకుని.. దానికి ఆడ్ ఆన్​గా లైవ్ మ్యూజిక్, స్టాండప్ కామెడీ, ఈవెంట్స్, హోమ్లీ ఎన్విరాన్​మెంట్, చక్కని హాస్పిటాలిటీ కల్పించి కస్టమర్ల ఆదరణ చూరగొంటున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టెర్రాసిన్ కెఫే ఇదే ఒరవడిలో వెళ్లినా.. వీగన్ ఫుడ్, స్లో ఫుడ్ క్వాలిటీస్​తో మరింత ప్రత్యేకతను చాటుకుంటోంది.

భోజనం.. జీవనవిధానం

రాజస్థాన్​కు చెందిన ధనేష్ ఆహార రంగంలో ఏదైనా వినూత్నంగా చేయాలనే అభిరుచితో ఇంజినీరింగ్ చేసి ఈ రంగంలోకి ప్రవేశించారు. భోజనం అనేది కడుపునింపుకునే అంశం నుంచి అదొక జీవనవిధానమని గుర్తించారు. అందుకే తన కెఫేకు వచ్చే వారికోసం వేడి వేడి ఆహారంతో పాటు ఇంటి వాతావరణాన్ని కల్పిస్తున్నారు.

ఆర్డర్​ చేయగానే భోజనం రాదు

ఈ కెఫేలో ఆర్డర్ చేయగానే భోజనం మీ టేబుల్ వద్దకు రాదు. మీ ఆర్డర్ తీసుకున్న తర్వాత వంట చేయటం ప్రారంభిస్తారు. కూరకు కావాల్సిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కోయడం దగ్గర్నుంచి అప్పుడే ప్రారంభిస్తారు. అన్ని హోటళ్లలో లభించే రెగులర్ మెనూ ఇక్కడ దొరకదు. ఫుడ్ లో వెరైటీ, ప్రయోగాలు కోరుకునే వారికి ఇది బెస్ట్ స్పాట్.

కాసేపు కబుర్లు

పాలు, పాలసంబంధ పదార్థాలు, మాంసం లేకుండా ఆహారం ఉంటుంది. అంటే పూర్తి వీగన్ రెస్టారెంట్. ఆర్డర్ చేసిన 30 నుంచి గంటలోపు మీరు ఆర్డర్ చేసిన డిష్ ని వేడివేడిగా వడ్డిస్తారు. అప్పటివరకు లైవ్ మ్యూజిక్ వింటూ.. పుస్తకాలు చదువుతూ, స్నేహితులు, బంధువులతో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయవచ్చు. ఇక్కడి ఇంటీరియర్ కూడా చాలా హోమ్లీగా ఉంటుంది. అరేబియన్, కరేబియన్ స్టైల్ లో భోంచేసేలా ఇక్కడ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

మూడు వెరైటీల్లో

అన్ని రాష్ట్రాల సంప్రదాయ రుచులు ఇక్కడ లభిస్తాయి. మాంసాహార ప్రియుల కోసం ఆర్గానిక్ ఫేక్ మీట్ వెరైటీలు లభ్యమవుతాయి. బ్రౌన్ రైస్, రాగి కేక్ వంటి రకాలు హెల్తీ డైట్ ను బేకరీ స్టైల్​లో అందింస్తుంటారు. ఏ వంటకమైనా.. నార్మల్, మీడియం, మోర్ స్పైసీ మూడు వెరైటీల్లో లభ్యమవుతాయి.

మళ్లీ మళ్లీ రావాలన్పిస్తుంది

ఫుడ్ డెలివరీ నెమ్మది అయినా.. ఇక్కడి ఫుడ్ వెరైటీస్, రుచి మమ్మల్ని మళ్లీ మళ్లీ వచ్చేలా చేస్తుందని కస్టమర్స్ అంటున్నారు.

ఫుడ్​తో పాటు.. కాసింత రిలాక్స్ అవ్వటానికి.. నచ్చినవారితో కాసేపు ప్రశాంతంగా భోంచేయటానికి, కబుర్లు చెప్పుకోవటానికి తమకు టెర్రాసిన్ ఎంతగానో దోహదపడుతోందని నగరవాసులు అంటున్నారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.