విభజన సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవాలన్న ముఖ్యమంత్రుల నిర్ణయానికి అనుగుణంగా రెండు రాష్ట్రాల అధికారులు సమావేశమయ్యారు. హైదరాబాద్ బీఆర్కేభవన్లో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విభజన వ్యవహారాల కార్యదర్శి రామకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ విభజన వ్యవహారాల కార్యదర్శి ప్రేమ్ చంద్రారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
విభజనాంశాలు సహా అన్ని విషయాలపైనా...
రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజనాంశాలు సహా అన్ని విషయాలపైనా భేటీలో చర్చించారు. విభజన చట్టం 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల వ్యవహారాలు, విద్యుత్ ఉద్యోగుల విభజన, పౌరసరఫరాల సంస్థ సంబంధిత అంశాలు, తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. రెండు రాష్ట్రాల అధికారులు తమ వాదనలను సమావేశంలో వినిపించారు.
షీలా బిడే కమిటీ సిఫార్సులపై...
కేంద్రం నియమించిన షీలా బిడే కమిటీ సిఫార్సులు, వాటిపై రెండు రాష్ట్రాలకు ఉన్న అభిప్రాయాలను కూడా సమావేశంలో వివరించారు. పోలీస్ పదోన్నతులకు సంబంధించి తాత్కాలిక కేటాయింపులనే తుది కేటాయింపులుగా పరిగణించి ముందుకువెళ్లాలని గతంలో అనుకున్నట్లుగా ముందుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు.
సీఎస్ల స్థాయిలో...
తదుపరి సీఎస్ల స్థాయిలో జరగనున్న సమావేశంలో అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించి అవసరమైన మేరకు నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఇవీ చూడండి: అసద్దుదీన్పై ఎన్నికల సంఘానికి మర్రి ఫిర్యాదు