దిల్లీ తెలుగు అకాడమీ 32వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హాజరయ్యారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులను కలుసుకోవడం సంతోషంగా ఉందని కేజ్రీవాల్ చెప్పారు. తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది దిల్లీలో స్థిరపడ్డారని.... వారు చూపించే ప్రేమకు ధన్యవాదాలు తెలియజేశారు. దిల్లీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, సుమన్‌లతోపాటు పలువురిని కేజ్రీవాల్ ఘనంగా సత్కరించారు.
ఇదీ చూడండి:కుప్పకూలిన వెదురు వంతెన.. భక్తులు క్షేమం