ETV Bharat / state

మంచి, చెడు స్పర్శలపై మీ పిల్లలకు చెప్పారా? - Good touch vs bad touch

మాటిమాటికీ తడుముతుంటే... ముద్దుచేస్తున్నారేమో అనుకుంటారు.. అది రాక్షస స్పర్శ అని తెలియని పసితనం పాపం! ఏవేవో మాటలు చెబుతూ ఒంటి మీద చేతులేస్తే... అది ప్రేమని సరిపెట్టుకుంటారు వాళ్లు... అది కాటేసే కర్కశత్వమని ఆలోచించని అమాయకత్వం వారిది! ఆ పసిపిల్లలకు లైంగిక విద్యపై అవగాహన కల్పిస్తోంది హైదరాబాద్‌కు చెందిన బ్రేక్‌ ది సైలెన్స్‌ స్వచ్ఛంద సంస్థ. దీన్ని నళిని ప్రారంభించారు.

Tell your children on the good and bad touches?
మంచి, చెడు స్పర్శలపై మీ పిల్లలకు చెప్పారా?
author img

By

Published : Dec 15, 2019, 3:24 PM IST

పసికందులపై అత్యాచారం. చిన్నపిల్లలపై లైంగిక హింస. మేనమామే కోడలితో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన. ఇవన్నీ మనం పేపర్లో నిత్యం చదివేవే. చదివి కలత చెందుతాం తప్ప... కదిలి వీటిపై పిల్లలకు అవగాహన కల్పించాలని ఎప్పుడూ అనుకోం. ఈ దుర్ఘటనలు హైదరాబాద్‌కు చెందిన నళినిని కలిచివేసేవి. వారిపై అఘాయిత్యం జరిగిందని వారు గుర్తించలేరు. సమస్య పెద్దదయితే తప్ప. ఇవి తల్లిదండ్రుల దృష్టికి రాదు. వీటిని నివారించడానికి ఏవైనా స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయా అని ఆమె ఆరా తీసింది. ఆమీర్‌ఖాన్‌ ‘సత్యమేవ జయతే’ కార్యక్రమంలో ఈ అంశంపై చర్చ జరిగింది. అందులో అతి తక్కువ సంస్థలు దీనిపై అవగాహన కల్పిస్తున్నాయని, ఎంతో మంది చిన్నారులు రాక్షసత్వానికి బాధితులేనని తెలుసుకుంది. ఇదే ఆమెను ‘బ్రేక్‌ ది సైలెన్స్‌’ అనే సంస్థను ప్రారంభించేలా చేసింది.

మంచి, చెడు స్పర్శలపై చిన్నారులకు అవగాహన

శిక్షణ తీసుకొని... పిల్లలకు మంచి, చెడు స్పర్శల గురించి అవగాహన కల్పించే తులిర్‌ సంస్థ గురించి తెలుసుకుంది. ఇది తమిళనాడు కేంద్రంగా పనిచేస్తోంది. అక్కడ ఆమె కొన్ని రోజులు శిక్షణ తీసుకుంది. వాటి ఆధారంగా వీడియోలు, పుస్తకాలు రూపొందించింది. తులిర్‌ సాయంతో ఈ సమస్య గురించి చిన్నారులకు వివరించాలనే ఆలోచనలు ఉన్నవారితో నళిని జట్టుకట్టింది. పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి వెళ్లినప్పుడు కొన్నిచోట్ల పరిస్థితి భిన్నంగా ఉండేది. ‘మీరు పిల్లలకు లేనిపోని ఆలోచనలు తీసుకొచ్చి, చిన్న విషయం కూడా అనుమానించేలా చేస్తున్నారు. మా పాఠశాలల్లో ఇవి అవసరం లేదు. మా స్కూల్లో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటామ’ని వారికి సమాధానాలు ఎదురయ్యేవి. ‘మేం పిల్లలకేం అసభ్యకర విషయాలు చెప్పం. లైంగిక హింస నుంచి వారిని వారు ఎలా కాపాడుకోవాలో శిక్షణ ఇస్తామ’ని వారిని ఒప్పించేవారు. ఈ సంస్థ ఇప్పటి వరకు 150 కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో ఎనిమిది మంది వాలంటీర్లు పని చేస్తున్నారు. నళిని భర్త రమేశ్‌ తప్ప మిగిలిన వారందరూ మహిళలే. ఇప్పటి వరకు సుమారు 25 వేల మంది చిన్నారులకు దీనిపై ఉచితంగా అవగాహన కల్పించారు.

ఏం చెబుతారు...

లైంగిక హింసకు గురైన చిన్నారులను పెద్దలు ఎలా గుర్తించాలి, పిల్లలు వారిని వారు ఎలా రక్షించుకోవాలో అవగాహన కల్పిస్తారు...

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఏం గమనించాలి...

  1. పిల్లలు ఎప్పుడూ లేనివిధంగా ఎవరినీ దగ్గరికి రానివ్వకపోవడం, భయం, చిరాకుతో ఉండటం, చురుకుదనం తగ్గడం ఇలాంటి ప్రవర్తనాపరమైన మార్పులు గుర్తించాలి.
  2. తరగతి గదిలోకి మాస్టారు వచ్చినప్పుడు ఇష్టపడకపోవడం, ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే తలుపులు మూయడం, వారికి దూరంగా వెళ్లడం వంటివి చేస్తున్నా... ఎప్పుడూ ఒకరి ఇంటికి వెళ్లి, అక్కడికి వెళ్లడం మానేసినా ఏం జరిగిందో అడగాలి.
  3. ఇటువంటి విషయాలు చెప్పడానికి పిల్లలు కొన్ని సందర్భాల్లో మాత్రమే ధైర్యం చేస్తారు. అందుకే వారు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు వారిని చెప్పకుండా వారించడం, పనుంది తరువాత చెప్పు అని అనకూడదు.
  4. మనమ్మాయి అందంగా లేదు. ఆమెనెవరు లైంగిక హింసకు గురిచేస్తారని పెద్దలు భావించొద్దు.

ఏం నేర్పాలి...

  • చిన్నతనంలోనే పిల్లలకు కళ్లు, చెవులు, ముక్కు గురించి ఎలా చెబుతారో... వ్యక్తిగత శరీర భాగాల గురించి అలాగే వివరించాలి. ఈ విషయాలు పెద్దలు మాట్లాడినప్పుడే పిల్లలు వారితో మాట్లాడతారనే విషయం వారు గుర్తించాలి.
  • తల్లిదండ్రులు పిల్లలకు మంచి స్పర్శ, చెడు స్పర్శ అంటే ఏంటో చెప్పాలి. ఎవరైనా పదే పదే పెదాలు, ఛాతీభాగం, రహస్య భాగాలు, పిరుదులు తడుముతుంటే గట్టిగా అరవమని చెప్పాలి. అక్కడి నుంచి వెంటనే వేరే చోటికి వచ్చి పెద్దలకు జరిగింది చెప్పాలనే ధైర్యాన్నివ్వాలి.

ఆడపిల్లలే కాదు మగపిల్లలూ ఇటువంటి దారుణాలకు గురవుతున్నారు. అందుకే పసిపిల్లల విషయంలో మగపిల్లాడే కదా వాడికేమవుతుందనే నిర్లక్ష్యం తల్లిదండ్రులకు తగదు. వారికీ వ్యక్తిగత శరీర భాగాల గురించి వివరించాలి. ఇంట్లోని ఆడపిల్లలకు గౌరవం ఇవ్వడం, వారి పనుల్లో భాగం పంచుకోవడం వంటివి నేర్పించాలి. లైంగిక విద్యను ప్రతి పాఠశాలలో బోధించాలని ఈ సంస్థలో వాలంటీర్‌గా చేస్తున్న ఛావి దవార్‌ ఇటీవల ఒక పిటిషన్‌ రూపొందించింది. ఆమె పీహెచ్‌డీ చేస్తోంది. ఈ పిటిషన్‌కు మద్దతు తెలుపుతూ ఎంతో మంది సంతకాలు చేస్తున్నారు.

ఈ కథనం చదవండి: మార్పెక్కడ: 17 రోజుల్లో 13 అఘాయిత్యాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.