ఈనెల 28న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో మంత్రివర్గ భేటీ జరగనుంది. ఈనెల 29న కూడా రెండు రోజులపాటు మంత్రివర్గ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. ఆర్టీసీ అంశంపైనే ప్రధానంగా కేబినెట్ చర్చించనుంది. ఆర్టీసీ సమస్యను ముగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్‌లో విస్తృతంగా చర్చించనున్నారు.
రూట్ల ప్రేవేటీకరణకు సర్కారు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. 5వేల 100 రూట్లలో ప్రైవేటు బస్సులకు అనుమతిచ్చేందుకు సుముఖంగా ఉంది. అటు ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు డిపోల వద్ద ఆందోళనకు దిగుతున్నారు. యాజమాన్యం మాత్రం ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున విధుల్లోకి తీసుకోబోమని స్పష్టం చేస్తోంది. ఈ పరిణామాలన్నింటి దృష్ట్యా ఎల్లుండి జరగనున్న కేబినెట్ భేటీపై ఉత్కంఠ నెలకొంది.
ఇదీ చూడండి: ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ