ETV Bharat / state

తెలంగాణ నూతన సీఎస్​గా సోమేశ్‌ కుమార్‌

తెలంగాణ నూతన సీఎస్​గా సోమేశ్​ కుమార్​ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమేశ్​ 1989 ఐఏఎస్​ బ్యాచ్‌కు చెందినవారు. జీహెచ్ఎంసీ కమిషనర్, గిరిజన సంక్షేమ, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రెవెన్యూశాఖ కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుత సీఎస్​ నీటి పారుదల వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించనున్నారు.

author img

By

Published : Dec 31, 2019, 6:22 PM IST

Updated : Dec 31, 2019, 7:15 PM IST

telangana new cs somesh kumar
తెలంగాణ నూతన సీఎస్​గా సోమేశ్‌ కుమార్‌

ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా సోమేశ్‌ కుమార్‌ ఎంపికయ్యారు. సోమేశ్​ను సీఎస్​గా నియమిస్తూ సీఎం కేసీఆర్‌ ఉత్తర్వులపై సంతకం చేశారు.1989 ఐఏఎస్​ బ్యాచ్‌కు చెందిన సోమేశ్​ జీహెచ్ఎంసీ కమిషనర్, గిరిజన సంక్షేమ, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రెవెన్యూశాఖ కార్యదర్శిగా పనిచేశారు. బిహార్​కు చెందిన సోమేశ్ కుమార్ ఏపీ కేడర్‌కు వెళ్లినా క్యాట్‌ అనుమతితో తెలంగాణలోనే కొనసాగుతున్నారు. 2020 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు బాధ్యతలు నిర్వర్తిస్తారు. సోమేశ్​ కుమార్​ ప్రగతి భవన్​కు వెళ్లి సీఎం కేసీఆర్​ను కలిశారు. తనను సీఎస్​గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

సలహాదారుగా జోషి

ఈ రోజు రిటైర్ కాబోతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. నీటి పారుదల వ్యవహారాల సలహదారుడిగా ఎస్.కె.జోషి వ్యవహరించనున్నారు.

తెలంగాణ నూతన సీఎస్​గా సోమేశ్‌ కుమార్‌

ఇవీ చూడండి: ఈఎస్​ఐ కుంభకోణం కేసులో మరొకరి అరెస్టు

File : TG_Hyd_55_31_New_CS_Dry_3053262 From : Raghu Vardha n ( ) రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ ను నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. 2020 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు సోమేశ్ కుమార్ సీఎస్ గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎక్కువ కాలం బాధ్యతలు నిర్వహించడం వల్ల స్థిరత్వం ఉంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అటు పదవీ విరమణ చేస్తోన్న శైలేంద్ర కుమార్ జోషి ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. నీటి పారుదల వ్యవహారాల సలహదారుడిగా ఎస్కే జోషి వ్యవహరించనున్నారు.
Last Updated : Dec 31, 2019, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.