విద్యార్థుల పరిశోధనలు నిలిచిపోకూడదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. అమ్మాయిలంతా వివాహం అయ్యాక కూడా తమకు నచ్చిన రంగాల్లో రాణించాలని సూచించారు.
హైదరాబాద్ నిజాం కళాశాలలో బయోటెక్నాలజీ సదస్సుకు ముఖ్య అతిథిగా తమిళిసై హాజరయ్యారు. బయోటెక్నాలజీ రంగం ప్రస్తుత పరిస్థితి-భవిష్యత్ అవకాశాలపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు.
రోజురోజుకూ జీవనసాంకేతిక రంగంలో ఎన్నో మార్పులొస్తున్నాయని తమిళిసై పేర్కొన్నారు. సరికొత్త విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఇటువంటి సదస్సులను ఉపయోగించుకుని సరికొత్త ఆవిష్కరణల వైపు కదం తొక్కాలని చెప్పారు.
- ఇదీ చూడండి : ఆ కాఫీ తాగితే... పది మందితో తాగిస్తారు!