దేశంలో కుటుంబ పార్టీలు కనుమరుగవుతున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. పలు రాష్ట్రాల ఉదాహరణలను తెలంగాణ ఎంపీలకు వివరించారు. తెలంగాణలోనూ ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు. కష్టపడి పనిచేయాలని, అందరినీ కలుపుకుని పోవాలని సూచించారు.
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఆరా...
యువ పశువైద్యురాలు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మోదీ ఆరా తీశారు. ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ప్రజాస్పందన ఎలా ఉందని ఎంపీలను అడిగి తెలుసుకున్నారు. పౌరసత్వ సవరణ బిల్లుకు తెరాస మద్దతు ఇవ్వలేదని ప్రధానికి ఎంపీ సంజయ్ గుర్తు చేశారు. తెరాస వాళ్లు అలాగే ఉంటారని మోదీ వ్యాఖ్యానించారు.
సమ్మక్క- సారలమ్మ విశిష్టత ఏంటి?
సమ్మక్క- సారలమ్మ విశిష్టత ఏమిటని మోదీ అడిగి తెలుసుకున్నారు. గరికపాటి మోహన్‌రావు అక్కడి నుంచే వచ్చారని కిషన్‌రెడ్డి చెప్పారు. వెంటనే స్పందించిన గరికపాటి.. సమ్మక్క, సారలమ్మ గద్దె విశిష్టతను వివరించారు.
ఇదీ చూడండి: నిర్భయ: న్యాయం కోసం ఈ నెల 18 వరకు ఆగాల్సిందేనా?