సాంఘిక, గిరిజన గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. రేపటి నుంచి డిసెంబరు 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సొసైటీల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశ పరీక్షకు అర్హులని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీల్లో కేవలం గిరిజన విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుందని ప్రవీణ్ కుమార్ తెలిపారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీల్లో చేరిన విద్యార్థులకు ఇంటర్‌తోపాటు.. జేఈఈ, నీట్, సీఏ, క్లాట్, తదితర ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇవ్వనున్నారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ ఐకాస భేటీ... భవిష్యత్ కార్యాచరణపై చర్చ