ETV Bharat / state

ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన విజయారెడ్డి అంత్యక్రియలు - ముగిసిన విజయారెడ్డి అంత్యక్రియలు

నాగోల్ శ్మశాన వాటికలో తహసీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు అధికార లాంఛనాల మధ్య ముగిశాయి. అంతిమయాత్రలో బంధువులు, రెవెన్యూ ఉద్యోగులు భారీగా పాల్గొన్నారు. ఆమె చితికి భర్త సుభాష్​ రెడ్డి నిప్పంటించారు. తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని పలు రాజకీయ పార్టీల నాయకులు, ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

ముగిసిన విజయారెడ్డి అంత్యక్రియలు
author img

By

Published : Nov 5, 2019, 9:04 PM IST

Updated : Nov 5, 2019, 9:29 PM IST

ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన విజయారెడ్డి అంత్యక్రియలు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ తహసీల్దార్ విజయారెడ్డికి రెవెన్యూ ఉద్యోగ సంఘాలు కన్నీటి వీడ్కోలు పలికాయి. ఉదయం నుంచి విజయారెడ్డిని కడసారి చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెవెన్యూ ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. పలు రాజకీయ పార్టీల నేతలు ఆమెకు నివాళులర్పించారు. పంజాబ్​ రెవెన్యూ అధికారులు సంతాపం ప్రకటించారు.

ఇంకెవరైనా ఉన్నరేమో..

విజయారెడ్డి అకాలమరణంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. తన భార్య హత్య వెనుక సురేశ్​​తో పాటు ఇంకెవరైనా ఉండొచ్చని సుభాష్​​ ​రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఎప్పుడూ విధుల్లో చురుగ్గా ఉండేదని.. ఎక్కడా ఒత్తిడి ఉన్నట్లు ఒక్కరోజు కూడా తన వద్ద ప్రవర్తించలేదని అన్నారు. విధుల పట్ల నిక్కచ్చిగా ఉండేదని.. పని పూర్తయ్యే వరకు కార్యాలయంలోనే ఉండేవారని తోటి అధికారులు తెలిపారు.

భారీ జనసందోహం నడుమ అంతిమయాత్ర

విజయారెడ్డి అంతిమయాత్ర భారీ జనసందోహం మధ్య జరిగింది. రాచకొండ సీపీ మహేశ్ భగవత్, ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి, తెజస అధ్యక్షుడు కోదండరాం తదితరులు పాల్గొన్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొత్తపేటలోని గ్రీన్​హిల్స్ కాలనీ నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర అల్కాపురి చౌరస్తాకు చేరుకున్నాక రెవెన్యూ ఉద్యోగులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా నినదిస్తూ న్యాయం జరిగే వరకు కదలమంటూ భీష్మించుకు కూర్చున్నారు. సీపీ మహేశ్ భగవత్ నచ్చజెప్పగా రెవెన్యూ ఉద్యోగులు శాంతించారు.

ట్రాఫిక్​కు అంతరాయం కలగకుండా..

నాగోల్- ఉప్పల్ ప్రధాన రహదారి మీదుగా అంతిమయాత్ర సాగగా పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. విజయారెడ్డి హత్య కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని రేవంత్​రెడ్డి, కోదండరాంతో పాటు రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్ చేశారు.

శ్మశాన వాటికకు చేరేవరకు దారిపొడవునా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అధికారిక లాంఛనాలతో విజయారెడ్డి దహనసంస్కారాలను పూర్తి చేశారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి నివాళులు అర్పించారు. విజయారెడ్డి చితికి ఆమె భర్త సుభాష్ రెడ్డి నిప్పంటించి కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు.

ఇదీ చదవండిః 'మూడు రోజులు విధులు బహిష్కరిస్తున్నాం'

sample description
Last Updated : Nov 5, 2019, 9:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.