షీ టీమ్‌లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మహిళా భద్రతా విభాగం రాష్ట్ర కార్యాలయంలో దీనికి సంబంధించిన విధి విధానాలను ఐజీ స్వాతి లక్రా వెల్లడించారు. ఈ ప్రత్యేక బృందాన్ని షీటీమ్ రాష్ట్ర బాధ్యురాలు స్వాతి లక్రా పర్యవేక్షించనున్నారు. షీటీమ్, డయల్ 100, హాక్-ఐ అప్లికేషన్లపై మహిళలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన ప్రత్యేక పోస్టర్లను విడుదల చేశారు.
అన్ని జిల్లాల్లోని మహిళా కళాశాలల్లో సైబర్ నేరాలపై షీ టీమ్స్ అవగాహన కల్పించనున్నాయి. మహిళా సంఘాలకు ఆత్మరక్షణ వంటి విద్యను నేర్పించనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు షీ టీమ్స్‌పై అవగాహన కోసం రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక బృందం స్త్రీల భద్రతా కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఇవీ చూడండి : మద్యపాన నిషేధానికి గ్రామ మహిళలు తీర్మానం