హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మదర్స్ అసోసియేషన్ హైద్రాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల పిల్లల్లో నాణ్యమైన విద్యా సామర్థ్యాల సమస్య ఏర్పడిందని అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ భాగ్యలక్ష్మి ఆరోపించారు. ఈ సమస్య ఒక్క ప్రభుత్వ పాఠశాలలో కాదని... ప్రైవేట్ స్కూల్లో కూడా ఉందని స్పష్టం చేశారు.
తమ కమిటీ ద్వారా బస్తీలలో ఉన్న పాఠశాలలోని విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించామని.. మూడింట రెండొంతుల మంది పిల్లల్లో వ్యత్యాసాలను గుర్తించినట్లు భాగ్యలక్ష్మీ పేర్కొన్నారు. ఈ విషయాలపై అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లిన ప్రయోజనం లేదన్నారు. విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండిః మొక్కి మరీ చోరీ చేశాడో దొంగ భక్తుడు