కొత్త సంవత్సరంలో ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు తీపికబురు అందించింది. రాష్ట్రంలో పనిచేస్తున్న 39వేల మంది పంచాయతీ కార్మికులకు ఉచితంగా బీమా సౌకర్యం కల్పించనుంది. ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ ఉద్యమకారుడు ఎస్కేడే పేరిట కార్మికులకు జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నారు. గ్రామపంచాయతీ కార్మికుల జీవితబీమా పథకానికి సంబంధించిన విధివిధానాలు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏడాదికి రూ. 968 ప్రీమియంతో రెండు లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని పంచాయతీ కార్మికులకు కల్పించనున్నారు. ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న పంచాయతీ కార్మికులకు బీమా వర్తిస్తుంది. భారతీయ జీవితబీమా సంస్థ- ఎల్ఐసీ ద్వారానే పంచాయతీ కార్మికులకు జీవితబీమా పథకాన్ని అమలు చేస్తారు.
ఇవీ చూడండి: నడిరోడ్డుపై పోకిరిని చితక్కొట్టిన మహిళలు