ETV Bharat / state

ఆదిపరాశక్తినే.. అమ్మగా అడుగుతున్నా... - కట్టెకి చీర కట్టినా వదలని కామాంధులు

కట్టెకి చీర కట్టినా వదలని కామాంధుల నుంచి ఆడపిల్లలను కాపాడడం అంత తేలీకేం కాకుండా పోతోంది. అలాంటి మృగాళ్లకి జన్మనిచ్చింది కూడా ఓ ఆడదే అంటే అమ్మతనంపైనే సిగ్గేస్తోంది. కానీ ఆడది ఆదిపరాశక్తి. ఆ శక్తిని బయటకు తీసి వారిని వారే కాపాడుకునేలా చేయాలి. లేనిపక్షంలో వారి రక్షణగా మీరూ వెంట నడవాలి.

rape
ఆదిపరాశక్తినే.. అమ్మగా అడుగుతున్నా...
author img

By

Published : Nov 30, 2019, 1:02 PM IST

నేను ఆ శివుడిలో సగాన్ని... మీరు కొలిచే అమ్మవారిని, శక్తిమాతను. నేను లేకపోతే జగత్తే లేదు. ఈ సృష్టిలో నేను అన్ని చోట్ల ఉండలేను కాబట్టే... జీవితాంతం మిమ్మల్ని కంటికి రెప్పలా కాచుకోవడానికి ఓ ఆడపిల్ల రూపంలో ఉన్న నా ప్రతిరూపాలను మీకు కానుకగా ఇస్తున్నాను. ఓ తల్లిగా, భార్యగా, కూతురిగా వారు మీకు అన్ని రూపాల్లో తోడుంటూ మిమ్మల్ని చూసుకుంటున్నారు. కానీ... మీరు చేసే కొన్ని పొరపాట్ల వల్ల వారు అత్యాచారాలకు గురవుతూ.. అన్యాయంగా చనిపోతున్నారు. మీ కోసం నేను పంపిన నా ప్రతిరూపాలను... చీమలుగా నలిపి, రాక్షసానందం పొందతూ వారికి బతికుండగానే నరకం చూపించి నాకే కానుకగా తిరిగి పంపుతున్నారు. వారిని చూడలేక, నాలో నేను నలిగిపోతూ... నేనూ ఓ ఆడదాన్ననే విషయం గుర్తొచ్చి... ఈ సృష్టిపైనే అసహ్యమేస్తోంది.

సృష్టినే నాశనం చేయాలనిపిస్తోంది...

నాకీ బాధ తప్పాలంటే... నేను ఈ సృష్టినైనా నాశనం చేయాలి. లేదా మీలో మార్పు అయినా తీసుకురావాలి. మీలో మార్పు రావడం చాలా కష్టమనిపిస్తోంది. కానీ తప్పు చేసే కొందరి కోసం అందరినీ నాశనం చేయలేకపోతున్నాను. అందుకే మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అమ్మాయి పుట్టగానే ఆమె చదువు, పెళ్లి గురించి కాకుండా తన కాళ్లపై తాను బతకగలిగేలా చేయాలి. మన పద్ధతులు, సంప్రదాయాలు, పనులు నేర్పినట్లుగానే వారిని వారు కాపాడుకోవడం నేర్పించాలి. మూడేళ్ల నుంచే బడికి పంపినట్లుగా కరాటే వంటి తరగతులకు పంపాలి. నేటి సమాజంలో చదువు ఎంత ముఖ్యమో ఆడపిల్లకు తనని తాను కాపాడుకోవడం అంతకంటే ముఖ్యం.

దివ్యాంగ, వృద్ధ మహిళలపై కూడా..

దివ్యాంగ, వృద్ధ మహిళలపై కూడా ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతుండటం బాధాకరం. తమని తాము కాపాడుకోలేని స్థితిలో ఉన్న వాళ్లని అర్ధరాత్రుళ్లు బయటకి పంపకూడదు. మరీ అత్యవసర పరిస్థితి అయితే మీరే వెంట ఉండి తీసుకెళ్లండి. తను ఎక్కడికి వెళ్లినా ఓ తండ్రిగా, భర్తగా, కొడుకుగా, సాటి మనిషిగా మీరు ఆమెని కాపాడుకోవాలి. నాకు పూజలు చేసే మీరే నా కన్నీళ్లను తుడవండి. ఇన్నాళ్లు మీ కోరికలు నెరవేర్చిన నేనే... ఓ ఆడదానిగా ఈ కోరిక కోరుతున్నాను. ఆడపిల్ల రూపంలో ఉన్న నన్నూ, నా ప్రతిరూపాలను కాపాడండి. ఈ సృష్టిని కాపాడుకోండి.

ఇవీ చూడండి: అమానుషం... మద్యం తాగించి మరీ కిరాతకం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.