ETV Bharat / state

అమ్మ గురించి ఆలోచించండి! - అమ్మపై కథనం

మీ అమ్మాయి పెళ్లి చేస్తున్నారు. అయితే కూతురి పెళ్లికి దగ్గరుండి ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఆరోగ్యం ఏంటని ఆలోచించారా... అయితే కింది వాటిని పాటిస్తే... ఆరోగ్యంతో పాటు... అందమూ మీ సొంతం అవుతుంది. అప్పుడు సూపర్​మామ్​గా మారిపోవచ్చు.

SPECIAL STORY ON CARING ABOUT MOTHER
అమ్మ గురించి ఆలోచించండి!
author img

By

Published : Feb 9, 2020, 4:05 PM IST

ఆడపిల్ల పెళ్లంటే మాటలా... ఎన్ని పనులు చక్కబెట్టుకోవాలి. పెళ్లికూతురికి కావాల్సిన పట్టుచీరలు, వాటికి సరిపోయే నగలనూ సిద్ధం చేసుకోవాలి. బంధువులందరికీ శుభలేఖలు వెళ్లాయో లేదో చూడాలి. ముఖ్యమైన వాళ్లను ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానించాలి. ఈ ఆలోచనలతో పెళ్లికూతురి తల్లి సతమతమవడం సహజమే. ఈ హడావుడిలో తన ఆహారం, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. వివాహం అయ్యేంతవరకూ ఎన్నో పనులను ఒంటి చేత్తో చక్కబెట్టే తల్లి.. పెళ్లయిన తర్వాత అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. అలాకాకుండా ఆమె తన ఆరోగ్యానికి పెద్దపీట వేసినప్పుడే పనులన్నీ సవ్యంగా పూర్తవుతాయంటున్నారు నిపుణులు.

  1. పెళ్లి పనులతో హడావుడిగా తిరిగే తల్లులు తమ బ్యాగులో చిరుతిళ్లు పెట్టుకోవాలి. డ్రైఫ్రూట్స్‌, తాజా పండ్లు పెట్టుకుంటే మరీమంచిది. సమయం దొరికినప్పుడు వీటిని తింటూ ఉండాలి. ఇవి శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. ఇలా చేయడం వల్ల ఉత్సాహంగా పెళ్లిపనులను పూర్తి చేయొచ్చు.
  2. బ్యాగులో డార్క్‌ చాక్లెట్‌ ఉంటే మంచిది. పని ఒత్తిడిలో ఒక్కోసారి నీరసం ఆవహించినప్పుడు చాక్లెట్‌ను నోట్లో వేసుకుంటే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.
  3. ఆహారంలో విటమిన్‌ ఇ నూనెను వినియోగించాలి. భోజనంలో ఉడకబెట్టిన తాజా కూరగాయలుండేలా చూసుకోవాలి. అల్పాహారంతోపాటు నానబెట్టిన బాదంపప్పులు, మొలకలు ఉంటే మంచిది.
  4. ముహూర్తం పెట్టినప్పటి నుంచీ కూతురి వివాహ వేడుక పూర్తయ్యేవరకు ప్రతి తల్లీ కాస్త ఒత్తిడికి గురికావడం మామూలే. ఇది క్రమేపీ ఆందోళనగా మారే అవకాశం ఉంది. దీన్ని అధిగమించాలంటే ధ్యానం చేయడం మంచిది. వీటిని పాటిస్తే ఆరోగ్యం, అందం మీ సొంతమవడమే కాదు.. సూపర్‌మామ్‌గానూ మారిపోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.