సూర్యగ్రహణం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాల్లో సంప్రోక్షణ చర్యలు ప్రారంభమయ్యాయి. ఆలయాల శుద్ధి అనంతరం దర్శనానికి భక్తుల అనుమతినించనున్నారు. ఉదయం 8 గంటల 11నిమిషాలకు గ్రహణం ప్రారంభం కాగా... 11 గంటల 5 నిమిషాలకు ముగిసింది.
హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయం, యాదాద్రిలో సంప్రోక్షణ చర్యలు చేపట్టారు. మరోవైపు జోగులంబ ఆలయంలో ఇప్పటికే ఆలయ శుద్ధి, మహాసంప్రోక్షణ చర్యలు ప్రారంభించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి భక్తులకు దర్శనం ప్రారంభం కానుంది.
భద్రాచలంలో కూడా ఆలయ సంప్రోక్షణ చర్యల అనంతరం మధ్యాహ్నం 3 గం.కు దర్శనాలకు అనుమతి ఉంది. కొండగట్టులో మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత సంప్రోక్షణ చర్యలు చేపట్టనున్నారు. అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.
ఇదీ చదవండి: శుద్ధి తర్వాతే భక్తులకు అనుమతి