దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్కౌంటర్పై ఏర్పాటైన సిట్.. కార్యాచరణ ప్రారంభించింది. మల్కాజ్ గిరి లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో సిట్ సభ్యులతో ఆ బృందానికి నేతృత్వం వహిస్తున్న రాచకొండ సీపీ మహేశ్ భగవత్ భేటీ అయ్యారు.
ఏడుగురు సభ్యుల బృందంతో ఎన్కౌంటర్పై సీపీ మహేశ్ భగవత్ సమీక్ష నిర్వహించారు. సిట్ బృందానికి సీపీ పని విభజన చేశారు. ప్రతేక దర్యాప్తు బృందంలో ఏడుగురు సభ్యులలో వనపర్తి ఎస్పీ అపూర్వ రావు, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్, రాచకొండ అదనపు డీసీపీ సురేందర్ రెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, రాచకొండ ఐటీ సెల్ సీఐ శ్రీధర్ రెడ్డి, కొరటాల సీఐ శేఖర్ రెడ్డి, సంగా రెడ్డి సీఐ వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు.