ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలన్నదే ఈ అక్కా చెల్లెళ్ల నినాదం. హైదరాబాద్‌కు చెందిన ప్రజ్ఞా నాగోరి, మృదు నాగోరి ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాలు చదువుతున్నారు. ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రచారం నిర్వహించారు. అక్కడి ఇంటర్ విద్యార్థులకు ప్లాస్టిక్ నిషేధించాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.
వ్యర్థాలను సేకరించి వాటితో సరికొత్త ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. పాత దుస్తులను సేకరించి మహిళలకు సంచులు కుట్టేందుకు ఇస్తూ ఉపాధి కల్పిస్తున్నారు.
ప్లాస్టిక్‌ని పూర్తిగా నిషేధించలేకపోయినా.. కనీసం తగ్గించాలంటున్న వీరు ఉర్ఘా పేరుతో ఓ యూత్ గ్రూపు నిర్వహిస్తున్నారు. పూర్తిస్థాయిలో కంపెనీ ఏర్పాటు చేసుకునేందుకు 18 ఏళ్లు ఎప్పుడు నిండుతాయా అని ఎదురుచూస్తున్న ఈ చిచ్చరపిడుగులతో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి...
ఇదీ చదవండిః ఈ సంతలో వాహనాలూ దొరుకుతాయ్!