సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్ టియాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్రంలో రెండో రోజు పర్యటించింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమైంది. సాధారణ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదర్ సిన్హాతో ఇవాళ సింగపూర్ బృందం సమావేశమైంది. ఫార్మా, ఐటీ, పట్టణాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని వారికి వివరించారు.
పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ
తెలంగాణలో మెరుగైన శాంతి భద్రతలతో ప్రశాంత వాతవరణం నెలకొని ఉందని వెల్లడించారు. పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని వాణిజ్యవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దశల వారీగా ప్లాస్టిక్ నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నట్లు అదర్ సిన్హా పేర్కొన్నారు. ఈ ప్రయత్నాన్ని సింగపూర్ ప్రతినిధి బృందం అభినందించింది. కోల్డ్ చైన్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని సింగపూర్ బృందం తెలిపింది. వాణిజ్య సంబంధాల పెంపునకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సింగపూర్ ప్రతినిధులు చెప్పారు.
ఇవీచూడండి: కేటీఆర్‌తో సింగపూర్ కాన్సుల్ జనరల్ భేటీ