నేటి నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై సందర్శకులకు అనుమతి ఇవ్వనున్నారు. కాగా ప్రయాణికులు, సందర్శకులకు ఇకపై ప్రతి ఆదివారం మాత్రమే బిడ్జిపై వెళ్లేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. అయితే కేబుల్ బ్రిడ్జిపై ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటలకు ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో సింఫోనీ బ్యాండ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ లైవ్ బ్యాండ్ ప్రదర్శనకు ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలని నిర్వహకులు తెలిపారు.
నార్తన్ బార్డర్లో విధులు నిర్వహిస్తున్న భారతీయ సైనికులు, జీహెచ్‌ఎంసీ శానిటేషన్ కరోనా వారియర్ల సేవలకు సంఘీభావంగా బ్యాండ్ ప్రదర్శనను ఏర్పాటు చేశామన్నారు. దీనిని వీక్షించేందుకుగాను ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పించామన్నారు. ఈ ప్రదర్శన 45 నిమిషాల పాటు కొనసాగనుంది. వందేమాతరంతో ప్రారంభించి పలు దేశభక్తి భారతీయ పాశ్చాత్య గీతాలు, సంగీతాన్ని ప్రదర్శించి జయహోతో ముగించనున్నారు.
ఇదీ చూడండి: నీలాకాశంలో తీగల వంతెన అందాలు చూశారా...!