అగ్నిప్రమాదం వ్యవహారంలో షైన్ ఆసుపత్రి యాజమాన్యంపై పోలీసులు 304ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఆసుపత్రి ఎండీ సునీల్ కుమార్ ఇంకా అందుబాటులోకి రాలేదని ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు.
మరోవైపు బాలల హక్కుల కమిషన్ ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. ప్రమాదంపై విచారణ జరుపుతున్న ప్రభుత్వ విభాగాల నుంచి నివేదికలు తెప్పించుకొని వాటిని పరిశీలించనుంది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య శాఖ కమిటీతో పాటు విద్యుత్ శాఖ అధికారులు ఆసుపత్రికి చేరుకొని అక్కడ సిబ్బంది, ప్రత్యక్ష సాక్షులను విచారించారు.
అగ్ని ప్రమాదంలో గాయపడిన అయిదుగురు చిన్నారులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విచారణ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టడానికి సర్కారు సిద్ధమవుతోంది. ఈ ఘటనతో ఆసుపత్రుల్లో భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నగరంలో అనేక ఆసుపత్రుల్లోనూ తక్షణం తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి: 'ముట్టడి'పై కాంగ్రెస్ సీనియర్ల సీరియస్