హైదరాబాద్ శివారు బాలపూర్ పోలీస్ స్టేషన్ పరిధి హబీబ్‌నగర్‌లో దారుణం జరిగింది. స్పీకర్ వైర్లను విద్యుత్ ప్లగ్‌లో పెట్టిన ఘటనలో ఏడేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
ఉస్మాన్‌నగర్‌కు చెందిన అజిజ్ ఈనెల మూడో తేదీన వాళ్ల నాన్నమ్మ ఇంటికి వచ్చాడు. పక్కింటి పిల్లాడితో ఆడుకుంటుండగా వాళ్లకో స్పీకర్ దొరికింది. వాళ్లిద్దరూ దాన్ని ఇంటికి తీసుకొచ్చి వైర్లు కలిపి వాటిని కరెంటు ప్లగ్‌లో పెట్టారు. వెంటనే స్పీకర్ పేలిపోయింది. ఘటనలో స్పీకర్‌ను చేతితో పట్టుకున్న అజిజ్ చేతికి తీవ్రగాయమైంది. చికిత్స నిమిత్తం బాలుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలిసి కూడా బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మరో బాలుడి తల్లిపై అజిజ్ తండ్రి పోలీసులు ఫిర్యాదు చేశాడు.
ఇదీ చూడండి: దారుణం... చలిమంటలో వృద్ధురాలి సజీవదహనం