చనువుగా ఉన్నప్పుడు దిగిన ఫొటోలను కుటుంబ సభ్యులకు పంపిస్తానని యువతిని బెదిరిస్తున్న యువకుడిని హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఫేస్బుక్ ద్వారా రాంనగర్‌కు చెందిన ఓ యువతికి, ఆంద్రప్రదేశ్ కడప జిల్లా కళాసపల్లికి చెందిన చంద్రశేఖర్‌కు పరిచయమైంది. ఇద్దరు చనువుగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలను తీసుకున్నారు.
ఇద్దరి మధ్య వివాదం కారణంగా విడిపోయారు. ఈ నేపథ్యంలో తాను చెప్పినట్టు వినకపోతే కుటుంబసభ్యులకు ఫొటోలు పంపిస్తానని చంద్రశేఖర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. తరుచూ త్రీవ వేధింపులకు గురి చేస్తున్నాడని ఆ యువతి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చూడండి : వరంగల్‌లో ముగిసిన యువతి అంత్యక్రియలు