ETV Bharat / state

సచివాలయం కూల్చొద్దు: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు - sec demolition highcourt order

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం సచివాలయం భవనాలు కూల్చడానికి వీల్లేదని తెలిపింది. ఈ నెల 14 వరకు సచివాలయం కూల్చివేత నిలిపేయాలంటూ ఆదేశించింది. తదుపరి విచారణ దసరా సెలవుల తర్వాత చేపడతామని స్పష్టం చేసింది.

సచివాలయం కూల్చొద్దు: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
author img

By

Published : Oct 1, 2019, 6:08 PM IST

Updated : Oct 1, 2019, 7:37 PM IST

సచివాలయం కూల్చొద్దు: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

సచివాలయం భవనాలను దసరా సెలవులు ముగిసే వరకు కూల్చవద్దని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. సెలవుల అనంతరం ఈ నెల 14న విచారణ చేపడుతామని.... అప్పటి వరకు కూల్చివేతలకు సంబంధించిన ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. సచివాలయం కూల్చివేయవద్దని దాఖలైన పలు పిటిషన్‌లు కొంతకాలంగా హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. అయితే రేపటి నుంచి హైకోర్టుకు సెలవులున్నాయని మరోవైపు ప్రభుత్వం వేగంగా కూల్చివేతకు సిద్దమవుతుందని పిటిషనర్లు ఇవాళ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇవాళే అత్యవసరంగా విచారణ చేపట్టాలని పిటిషనర్లు కోరగా ధర్మాసనం అంగీకరించింది. కోర్టులో పిటిషన్లపై విచారణ పెండింగ్‌లో ఉండగా కూల్చివేతలపై ముందుకు వెళ్లడం సమంజసం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. కూల్చివేసిన తర్వాత పిటిషన్లపై కోర్టు తేల్చేది ఏముంటుందని వ్యాఖ్యానించింది. సచివాలయం కూల్చివేసి కొత్తగా నిర్మించడం వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని పిటిషనర్ల ప్రధాన వాదన. సచివాలయం ప్రస్తుత అవసరాలకు సరిపోవడంలేదని... ప్రమాదాలు జరిగే అస్కారం పొంచి ఉందని... నిపుణుల సూచనల మేరకే పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నామని ప్రభుత్వం వాదిస్తుంది.

ఇవీ చూడండి: కర్కశ తండ్రి: ఆడపిల్ల పుట్టిందని చంపేశాడు

Intro:Body:Conclusion:
Last Updated : Oct 1, 2019, 7:37 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.