ETV Bharat / state

'విద్యార్థుల్లో దాగున్న నైపుణ్యం వెలికితీయాలి' - హైదరాబాద్​లో 5వ ఇంటర్ సొసైటీ లీగ్ స్పోర్ట్స్ మీట్- 2020

హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యూషన్స్ సొసైటీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  5వ ఇంటర్ సొసైటీ లీగ్ స్పోర్ట్స్ మీట్- 2020 ఘనంగా ప్రారంభమైంది.

Saniya mirja on sports
'విద్యార్థుల్లో దాగున్న నైపుణ్యం వెలికితీయాలి'
author img

By

Published : Jan 3, 2020, 6:45 PM IST

విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు స్పోర్ట్స్ లీగ్​లు ఎంతగానో దోహదపడతాయన్నారు ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా. హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యూషన్స్ సొసైటీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5వ ఇంటర్ సొసైటీ లీగ్ స్పోర్ట్స్ మీట్- 2020 ఘనంగా ప్రారంభమైంది.

'విద్యార్థుల్లో దాగున్న నైపుణ్యం వెలికితీయాలి'

ఈ కార్యక్రమానికి టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా, రిటైర్డ్ ఐపీఎస్ ఏకే ఖాన్, తెలంగాణ సోషల్ వెల్ ఫెయిర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యూషన్స్ సొసైటీస్ సెక్రటరీ ఆర్​ఎస్ ప్రవీణ్ కుమార్​ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

క్రీడలు విద్యార్థులకు క్రమశిక్షణను నేర్పించి.. వారి జీవితంలో ఉన్నత ఎదుగుదలకు ఉపయోగపడుతుందని మాజీ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ అన్నారు. నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ లీగ్​లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏడు రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్​కు చెందిన 5వేల మంది విద్యార్థులు అండర్ 14 ,17 , 19 విద్యార్థులు పలు క్రీడల్లో పోటీపడుతున్నారు.

ఇవీ చూడండి: మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.