హైదరాబాద్ ఈయూ కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో ఆర్టీసీ ఐకాస నేతలు భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ నెల 19న హైదరాబాద్-కోదాడ వరకు సడక్ బంద్ కార్యక్రమం నిర్వహిస్తామని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసుకునేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.
విడుదల చేయాలి
పోలీసులు అరెస్ట్ చేసిన ఆర్టీసీ కార్మికులు, నేతలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సురక్షితమైన ప్రజారవాణా వ్యవస్థను కాపాడుకోవాలన్నారు. సేవ్ ఆర్టీసీ పేరుతో రేపు గ్రామగ్రామాన బైక్ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 16న బస్సు రోకో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు అశ్వత్థామరెడ్డి.
ఇవీ చూడండి: 'శబరిమల' కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ