ETV Bharat / state

ఆ ఒక్కటి పక్కనబెడతాం.. మిగతావి పరిష్కరించండి - ts rtc strike

సమస్యల పరిష్కారం కోసం 41 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ప్రధాన డిమాండైన ఆర్టీసీ విలీనం అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. సమ్మెను మాత్రం మరింత ఉద్ధృతం చేస్తున్నట్లు ఆర్టీసీ ఐకాస ప్రకటించింది. శుక్రవారం అన్ని డిపోల నుంచి గ్రామాల్లోకి బైక్ ర్యాలీలు, శనివారం జేఏసీ నాయకుల నిరవధిక నిరాహార దీక్ష, 19 సడక్ బంద్ కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.

ఆ ఒక్కటి పక్కన బెడతాం.. మిగతావి పరిష్కరించండి
author img

By

Published : Nov 14, 2019, 11:19 PM IST

Updated : Nov 14, 2019, 11:52 PM IST

ఆ ఒక్కటి పక్కన బెడతాం.. మిగతావి పరిష్కరించండి

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని... తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు గత 41 రోజులుగా సమ్మె బాట పట్టారు. ప్రభుత్వం తమ మ్యానిఫెస్టోలో లేదని చెబుతుంటే కార్మికులు మాత్రం పక్క రాష్ట్రంలో చేసినప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ అంశంపై ఆర్టీసీ జేఏసీ వెనక్కి తగ్గింది. విలీనం అంశంలో ప్రభుత్వం అటు ప్రజలను, కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నందున ఈ అంశాన్ని తాము తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నామని మిగిలిన అంశాలపై ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని కోరింది.

భవిష్యత్‌ కార్యాచరణపై...

ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యల నివారణ, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు ఆర్టీసీ ఐకాస, విపక్ష నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి కోదండరాం, ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, జితేందర్‌ రెడ్డి, వీహెచ్‌తో పాటు ఆర్టీసీ ఐకాస నేతలు అశ్వత్థామ రెడ్డి, రాజిరెడ్డి హాజరయ్యారు. ఇప్పటికే 23 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని అయినా ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ కూడా స్పందించలేదని విమర్శించారు. పోలీసులు మఫ్టీలో వచ్చి ఐకాస నేతలను అరెస్టు చేస్తున్నారని... వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

నిరవధిక నిరాహార దీక్ష

విలీనం అంశం తాత్కాలికంగా పక్కకి పెట్టినప్పటికీ మిగిలిన డిమాండ్లపై తగ్గేది లేదని సమ్మెని మరింత ఉద్ధృతం చేస్తామని ఐకాస ప్రకటించింది. శుక్రవారం డిపోల నుంచి గ్రామాల్లోకి ఆర్టీసీ కార్మికులు బైక్ ర్యాలీగా వెళ్లి ఆర్టీసీని కాపాడాలంటూ...ఆర్టీసీని ప్రయివేటు పరం చేస్తే వచ్చే నష్టాలను ప్రజలకు వివరించనున్నారు. 16న ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డితో పాటు కో కన్వీనర్లు రాజిరెడ్డి, లింగమూర్తి, సుధలు నిరవధిక నిరాహార దీక్ష చేయనున్నారు. వీరి దీక్షలకు మద్దతుగా అన్ని డిపోల ముందు కార్మికులు 17,18 న సామూహిక దీక్షలు చేయాలని నిర్ణయించారు.

19న సడక్ బంద్​

ఇక 19న హైదరాబాద్ నుంచి కోదాడ సడక్ బంద్​ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. తాము చేపట్టే కార్యక్రమాలకు అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ విద్యార్థి సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరారు. విలీనం డిమాండ్​పై ఐకాస వెనక్కు తగ్గడంతో ఇక ఇప్పటికైనా ప్రభుత్వం మిగిలిన డిమాండ్లపై చర్చలకు పిలుస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇవీ చూడండి: 'శబరిమల' కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ

sample description
Last Updated : Nov 14, 2019, 11:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.