ఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక సంఘాల చర్చలు విఫలమయ్యాయి. చర్చలు అసంపూర్తిగా ముగిశాయని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు. నిర్బంధ వాతావరణంలో చర్చలు జరిగాయని తెలిపారు. ఎక్కడా తమకు మాట్లాడే అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు. చర్చలు ప్రారంభానికి ముందే మా చరవాణులను గుంజుకున్నారని... కేవలం 21 డిమాండ్లపై మాత్రమే చర్చిస్తామన్నారని తెలిపారు. తాము అన్నీ డిమాండ్లపై చర్చ జరగాలని కోరినట్లు అశ్వత్థామ రెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి చర్చలు విఫలమైనా... మళ్లీ పిలిస్తే చర్చలకు వెళ్లేందుకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.
చర్చలు విఫలం... పిలిస్తే మళ్లీ వెళ్తాం: అశ్వత్థామ రెడ్డి - RTC Discussions completed
12:00 October 26
చర్చలు విఫలం... పిలిస్తే మళ్లీ వెళ్తాం: అశ్వత్థామ రెడ్డి
12:00 October 26
చర్చలు విఫలం... పిలిస్తే మళ్లీ వెళ్తాం: అశ్వత్థామ రెడ్డి
ఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక సంఘాల చర్చలు విఫలమయ్యాయి. చర్చలు అసంపూర్తిగా ముగిశాయని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు. నిర్బంధ వాతావరణంలో చర్చలు జరిగాయని తెలిపారు. ఎక్కడా తమకు మాట్లాడే అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు. చర్చలు ప్రారంభానికి ముందే మా చరవాణులను గుంజుకున్నారని... కేవలం 21 డిమాండ్లపై మాత్రమే చర్చిస్తామన్నారని తెలిపారు. తాము అన్నీ డిమాండ్లపై చర్చ జరగాలని కోరినట్లు అశ్వత్థామ రెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి చర్చలు విఫలమైనా... మళ్లీ పిలిస్తే చర్చలకు వెళ్లేందుకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.
TAGGED:
RTC Discussions completed