ETV Bharat / state

‘కోడ్‌’తో వలవేసి.. ఖాతా ఖాళీ చేసి! - anti virus

వాట్సాప్‌లో క్యూఆర్‌ కోడ్‌ పంపించి లావాదేవీలు జరుపుతారు. పొరపాటున మీరు స్కాన్​ చేస్తే... అంతే ఇక. క్షణాల్లో మీ ఖాతాల్లోంచి డబ్బులు మాయమవుతాయి. దుకాణదారులు, వ్యాపారులే లక్ష్యంగా కేటుగాళ్ల కొత్త మోసం చేస్తున్నారు.

qr code with cyber crime
‘కోడ్‌’తో వలవేసి.. ఖాతా ఖాళీ చేసి!
author img

By

Published : Dec 15, 2019, 11:17 AM IST

నగరానికి చెందిన ఓ దుకాణ నిర్వాహకుడికి రూ.21వేలు విలువ చేసే 20 లీటర్ల హైడ్రాలిక్‌ ఆయిల్‌ కావాలంటూ ఇటీవల ఓ ఫోన్‌ వచ్చింది. వాట్సాప్‌లో పంపిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే మీకు రావాల్సిన డబ్బు ముందుగానే మీ ఖాతాలో పడుతుందని నమ్మించారు. తీరా చూస్తే.. డబ్బులు రావడం సంగతి పక్కన పెడితే దుకాణ నిర్వాహకుడి బ్యాంకు ఖాతా నుంచి రూ.56వేలు మాయం కావడంతో లబోదిబోమంటూ సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. తీగ లాగితే డొంక ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మధురలో బయటపడింది. అమాయకుల్ని నట్టేట ముంచేందుకు కేటుగాళ్లు ఇలాంటి కొత్త తరహా సైబర్‌ మోసాలకు తెరదీసినట్లుగా తేలడంతో పోలీసులు అవాక్కయ్యారు.

గూగుల్‌, జస్ట్‌ డయల్‌లో..!

సాంకేతిక పరిజ్ఞానం కొంగొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ సైబర్‌ మోసాలు పెరుగుతున్నాయి. రోజుకో కొత్త తరహాలో కేటుగాళ్లు బ్యాంకు ఖాతాల్లోని డబ్బును మాయం చేస్తున్నారు. తాజాగా వ్యాపారులు, దుకాణదారులే లక్ష్యంగా వాట్సాప్‌లో క్యూఆర్‌ కోడ్‌ను పంపించి మోసాలకు పాల్పడుతున్నారు. దుకాణాలకు సంబంధించిన సమాచారాన్ని గూగుల్‌, జస్ట్‌ డయల్‌లో పరిశోధిస్తున్నారు. కిరాణ దుకాణాలు, బేకరీలు తదితర దుకాణాలను వదిలేసి భారీగా లావాదేవీలు నిర్వహించే ఇతర దుకాణాలను ఎంపిక చేసుకుంటున్నారు. అక్కడే ఫోన్‌ నంబర్‌ ఉంటే సరి.. లేదంటే సదరు దుకాణాల పేరుతో వెబ్‌సైట్లు ఉన్నాయేమోనని పరిశీలించి అక్కడి నుంచి ఫోన్‌ నంబర్లను సేకరిస్తున్నారు.

మాకు అత్యవసరంగా కావాలి..!

మేం ఫలానా సంస్థ నుంచి మాట్లాడుతున్నాం.. మాకు అత్యవసరంగా ఉత్పత్తులు కావాలని, ఒకటి, రెండ్రోజుల్లో డెలీవరీ చేయడం సాధ్యమవుతుందా అంటూ రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. మీరు డెలివరీ చేయక ముందే డబ్బులు మీ ఖాతాలో జమ చేస్తామని, ఇందులో సందేహపడాల్సిందేమీ లేదని నమ్మిస్తున్నారు. గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ యాప్‌ను ఏ ఫోన్‌ నంబర్‌తో వినియోగిస్తున్నారో చెప్పాలని అడుగుతున్నారు. ఆ యాప్‌లోకెళ్లి క్యూఆర్‌ కోడ్‌ను తయారు చేసి వాట్సాప్‌కు పంపిస్తున్నారు. ఆ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి పిన్‌ నంబర్‌(యాప్‌కు సంబంధించిన)ను నమోదు చేయాలంటూ సూచిస్తున్నారు. ముంగిటకొచ్చిన ఆర్డర్‌ను వదులుకోవడం ఇష్టం లేక సదరు దుకాణదారులు ముందు వెనుకా ఆలోచించకుండా యాప్‌ను తెరిచి స్కాన్‌ చేస్తున్నారు.

తిరిగి చెల్లించేందుకు మరోసారి..!

ఆ క్యూర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయగానే అటువైపు నుంచి కేటుగాళ్లు క్షణాల్లోనే బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును మాయం చేస్తున్నారు. ఆందోళనకు గురై మళ్లీ ఫోన్‌ చేస్తే అయ్యో.. అలా జరిగేందుకు వీల్లేదు.. ఎక్కడో తప్పు జరిగింది.. మీ డబ్బులను రిఫండ్‌ చేసేందుకు కొత్తగా పంపించే క్యూఆర్‌ కోడ్‌ను మరోసారి స్కాన్‌ చేయాలని కోరుతున్నారు. స్కాన్‌ చేసిన ప్రతిసారి ఎంతో కొంత మొత్తం ఖాతా నుంచి మాయమవుతోంది. ఇదేంటని గట్టిగా నిలదీస్తే రిఫండ్‌ అవ్వడానికి కొద్దిగా సమయం పడుతుందంటూ బుకాయించి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. డిజిటల్‌ యాప్స్‌లో లావాదేవీలను నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఒక్కసారి ఖాతా నుంచి పోయిన డబ్బు తిరిగి రావడం చాలా కష్టమని సైబర్‌క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇవీ చూడండి: 'దేశవ్యాప్తంగా దిశ బిల్లు తెచ్చేవరకు దీక్ష విరమించను'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.