నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎల్బీనగర్ క్రైం డీసీపీ యాదగిరి అన్నారు. డీసీపీ, ఏసీపీ పృథ్విధర్ రావు నేతృత్వంలో హైదరాబాద్ చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు.
వాహనాల స్వాధీనం
సరైన ధ్రువ పత్రాలులేని 23 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలు, ఏడుగురు పాత నేరస్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు క్రైం డీసీపీ యాదగిరి తెలిపారు. నిర్బంధ తనిఖీలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో ధైర్యం కలుగుతుందన్నారు. సోదాల్లో 250మంది పోలీసులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: గోదాం నిర్మాణాలకు కేంద్రం సహకరించాలి: నిరంజన్‌రెడ్డి