ETV Bharat / state

ఫోను పక్కనుంటే.. పలకరింపే కరువాయే!

వారంతా ఓ బృంద సభ్యులు. 20 మందికి పైగానే ఉంటారు. రాత్రంతా కలిసి పనిచేస్తారు. ఏటా డిసెంబరు 31వ తేదీ అర్ధరాత్రీ వారంతా విధుల్లో ఉంటారు. కానీ చాలామంది నోరు విప్పి ఒకరికి ఒకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోరు. తెల్లవారుజామున ఇళ్లకు వెళ్లిన తరవాత మాత్రం సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు చెప్పుకొంటారు. ఆధునిక యుగంలో మారిన పరిస్థితికి.. చరవాణి పోషిస్తున్న కీలకపాత్రకు ఇది ఓ నిదర్శనం.

author img

By

Published : Dec 13, 2019, 10:48 AM IST

phone effects in human life
కష్టమైనా.. సుఖమైనా అదే వేదికపై సంభాషణలు!!

ప్రస్తుతం చాలామంది ఒక్క క్షణం చరవాణిని విడిచి ఉండలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకప్పుడు నలుగురు ఒక చోట కలిస్తే కష్ట సుఖాలు మాట్లాడుకునే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అన్నింటినీ మొబైల్‌ ఫొన్లలోనే పంచుకుంటున్నారు. చుట్టూ ఆత్మీయులు ఉన్నా నేరుగా పలకరించకుండా చరవాణిలోనే సంభాషించుకోవడం ప్రస్తుత పద్ధతి. సంతోషమొచ్చినా.. బాధ వచ్చినా మనసులోని భావాలను వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలోనే పోస్టు చేస్తున్నారు.

జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. అన్నింటిని ఎదుర్కొని ముందుకు వెళ్తేనే అనుకున్న లక్ష్యానికి చేరుకుంటారు. ఇలా నిజ జీవితంలో జరుగుతున్న పరిస్థితులను ఎవరికి చెప్పాలో తెలియక సతమతం అవుతున్నారు. నేరుగా వివరించి భావోద్వేగాలకు లోనవకుండా సామాజిక మాధ్యమాలను వేదిక చేసుకుంటున్నారు. చరవాణులు ఉపయోగించే వారిలో 80 శాతం మంది చిత్రాలు, సందేశాలు స్టేటస్‌ల్లో వారి పరిస్థితిని తెలియజేస్తున్నారు.

ఒక్క క్లిక్‌తో ఓదార్పులు.. బుజ్జగింపులు

మాటల్లో చెప్పలేని ఎన్నో విషయాలను సామాజిక మాధ్యమాల్లో ఒక్క క్లిక్‌తో తెలియజేస్తున్నారు. ఆనంద, ఉద్విగ్న క్షణాలను చిత్రాలు, సందేశాల రూపంలో పోస్టు చేస్తున్నారు. చూసిన ఆత్మీయులు, స్నేహితులు అదే పద్ధతిలో బదులిస్తున్నారు. ఆనంద క్షణాలైతే.. చాలా సంతోషంగా ఉన్నావు... మరిన్ని విజయాలను సాధించాలంటూ ప్రోత్సహిస్తున్నారు. ఉద్విగ్న క్షణాలైతే.. జీవితమంటేనే పోరాటం.. నీ వెంట మేమున్నాం.. ఓటములే గుణపాఠాలు.. అధైర్య పడకుండా ముందుకెళ్తేనే విజయాలు వరిస్తాయని అనునయిస్తున్నారు.

80 శాతం మంది వద్ద స్మార్ట్‌ఫోన్లు

గతంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా.. నేరుగా వెళ్లి పంచుకునేవారు. ప్రస్తుతం పెరిగిన సాంకేతికతను ఉపయోగించుకొని గంటల తరబడి రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు సామాజిక మాధ్యమాల్లోనే మునిగితేలుతున్నారు. నగరంలో కోటికిపైనే జనాభా ఉంది. దాదాపు 80 శాతం మంది వద్ద స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి. తక్కువ ధరకే మొబైల్‌ డేటా వస్తుండడంతో వినియోగం గణనీయంగా పెరిగింది.

నేరుగా చెబితే ఎలా స్పందిస్తారో..

కొన్ని విషయాలను నేరుగా చెప్తే ఎలా స్పందిస్తారో తెలియదు. ఆనందం కానీ, బాధ కానీ సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం అధికమైంది. ఫోన్లలో గంటల తరబడి మాట్లాడకుండా సామాజిక మాధ్యమాల్లో సంభాషణల ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు.- ప్రహర్షిత, న్యాయశాస్త్ర విద్యార్థిని'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.